Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాతిపై కూర్చున్న జంట.. మహిళను కొట్టుకుపోయిన భారీ కెరటం (video)

Advertiesment
Bandra

సెల్వి

, మంగళవారం, 18 జులై 2023 (17:24 IST)
Bandra
ముంబైలోని బాంద్రాలో అతిపెద్ద కెరటంలో ఓ మహిళ కొట్టుకుపోయిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె నీటిలో అలా కొట్టుకుపోతుంటే.. పిల్లలు భయంతో అరుస్తున్నట్లు ఆ వీడియోలో కలదు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
వివరాల్లోకి వెళితే.. జ్యోతి సోనార్‌గా గుర్తించబడిన 32 ఏళ్ల మహిళ ముంబైలోని బాంద్రాలోని బ్యాండ్‌స్టాండ్ వద్ద భారీ కెరటంలో కొట్టుకుపోయింది. ఆమె భర్త, ఆమె పిల్లలు ఆ సమయంలో పెద్దగా అరుస్తూ నిస్సహాయంగా చూస్తుండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 
 
ఈ ఘటనకు సంబంధించి ఇంటర్నెట్‌లో భయానక క్లిప్‌లు వైరల్ అవుతున్నాయి. ఈ భయంకరమైన సంఘటన జరిగినప్పుడు దంపతులు ఒక రాతిపై కూర్చున్నారు. వారి పిల్లలు ఆనందకరమైన క్షణాన్ని చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఇంతలో అతిపెద్ద కెరటం ఆమెను అలా కొట్టుకుపోయింది. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నీటి బకెట్లో పడి ప్రాణాలు కోల్పోయిన 11 నెలల బాలుడు