Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆ మద్యంబాటిల్ ధర రూ.కోటి ... ఎక్కడ?

Advertiesment
World Oldest
, ఆదివారం, 18 జులై 2021 (17:43 IST)
సాధారణంగా మంచి బ్రాండ్ వాల్యూ ఉన్న విస్కీ మద్యం ధర మహా అయితే, 10 లేదా 20 వేలు ఉంటుంది. ఇక విదేశీ మద్యం విలువ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన కంపెనీలనుబట్టి 50 వేల నుంచి లక్ష రూపాయల వరకు ఉండొచ్చు. కానీ, ఓ మద్యం బాటిల్ విలువ కోటి రూపాయలు ఉంటుందని ఎవరైనా ఊహించగలరా?. 
 
నిజమే... ఇంగ్లండ్‌లోని ప్ర‌ముఖ వేలం సంస్థ స్కినార్ ఇంక్ బాటిల్‌ను వేలం నిర్వ‌హించగా మిడ్‌టౌన్ మ‌న్హాట‌న్ మ్యూజియం, ది మోర్గాన్ ప‌రిశోధ‌న సంస్థ క‌లిసి ఈ బాటిల్‌ను 1,37,500 డాల‌ర్ల‌కు దక్కించుకున్నాయి. అంటే భారతీయ కరెన్సీలో కోటి రూపాయలు. 
 
అయితే ఇది మాములు విస్కీ బాటిల్ కాదట. సుమారు 250 ఏళ్ల క్రితం త‌యారు చేశారట ఈ బాటిల్‌ని. ఈ విస్కి బాటిల్ పేరు ఓల్డ్ ఇంగ్లెడ్వ్‌. దీనిని 1860వ సంవ‌త్స‌రంలో త‌యారు చేశారు. ఇన్ని సంవత్సరాలు దాన్ని అలాగే ఉంచడంతో అనుకున్న ధ‌ర కంటే ఆరురెట్లు అధిక ధ‌ర‌కు అమ్ముడుపోయిందని వేలం సంస్థ ప్ర‌క‌టించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరెన్నీ నోట్లను ముక్కలు చేసిన ఎలుకలు.. అండగా నిలిచి మంత్రి సత్యవతి