Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పగలు సంసారం.. రాత్రి వ్యభిచారం.. గలీజు గబ్బు వ్యక్తి విజయసాయి...

ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసిన వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డిపై తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు ఒక్కసారిగా మాటలదాడి చేస్తున్నారు.

Advertiesment
పగలు సంసారం.. రాత్రి వ్యభిచారం.. గలీజు గబ్బు వ్యక్తి విజయసాయి...
, బుధవారం, 28 మార్చి 2018 (14:07 IST)
ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసిన వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డిపై తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు ఒక్కసారిగా మాటలదాడి చేస్తున్నారు. ఒక తల్లికి, తండ్రికి పుట్టినవాడైతే తనను ఆర్థిక నేరగాడు విజయ్ మాల్యాతో పోల్చరంటూ విజయసాయి రెడ్డి మంగళవారం ఢిల్లీలో సీఎం చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. 
 
అలాగే, టీడీపీ నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ మాటలదాడి చేస్తున్నారు. తాజాగా టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర మాట్లాడుతూ, పగలు సంసారం చేస్తూ, రాత్రి రాజకీయ వ్యభిచారం చేయడం వైకాపా నేతల నైజమన్నారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చీటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారంటూ దుయ్యబట్టారు. పెద్దల సభకు ప్రాతినిథ్యం వహిస్తున్న విజయసాయి... ఆ సభకు మచ్చ తెచ్చేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సంస్కారహీనంగా మాట్లాడుతూ, రాజ్యసభ గౌరవాన్ని దిగజార్చుతున్నారని అన్నారు. ప్రధాని కాళ్లకు మొక్కడం ద్వారా ఆయన తన అసలు నైజాన్ని చాటుకున్నారని ఎద్దేవా చేశారు.
 
అలాగే, ఏపీ మంత్రి ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ, విజయసాయి రెడ్డి నీచాతినీచంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. స్వలాభం కోసం సంస్కారహీనంగా వ్యవహరిస్తున్నారన్నారు. బెంగళూరులో తన పెద్దల పేరుతో తాను ట్రస్ట్‌ను నిర్వహిస్తుంటే... క్లబ్ నడుపుతున్నానంటూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తన ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తున్నానని చెప్పారు. తనపై చేసిన ఆరోపణలు విజయసాయి నిరూపిస్తే... ఉరి వేసుకుంటానని సవాల్ విసిరారు. 
 
విజయసాయి గలీజు, గబ్బు వ్యక్తి అని అన్నారు. విజయసాయి చరిత్రే గబ్బు అని చెప్పారు. ఆయనకు మతి భ్రమించిందని, అందుకే గతి తప్పాడని చెప్పారు. కేసుల నుంచి బయటపడేందుకు ప్రధాని నరేంద్ర మోడీ కాళ్లు పట్టుకున్నారని... కాళ్లు పట్టుకున్నా దేవుడు కూడా అతన్ని కాపాడలేడని జోస్యం చెప్పాడు. తప్పుడు లెక్కలు, దొంగ కంపెనీలు పెట్టడంలో విజయసాయి దిట్ట అని చెప్పుకొచ్చారు. 
 
ఇలాంటి గబ్బు వ్యక్తా తమ గురించి మాట్లాడేదని మండిపడ్డారు. ఆయన ఒక కుసంస్కారి అని... మొత్తం వైసీపీనే సంస్కారం లేని పార్టీ అని విమర్శించారు. వైయస్ కుటుంబ చరిత్ర గొప్పదా, తన కుటుంబ చరిత్ర గొప్పదా అనే విషయంపై చర్చకు రావాలని మంత్రి ఆదినారాయణ రెడ్డి సవాల్ విసిరారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రహస్యంగా ఎందుకు కలుస్తున్నారు? టీడీపీ ఎంపీలకు చంద్రబాబు చీవాట్లు