Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మోడీ కాళ్ళు మొక్కలేదని విజయసాయి చెపుతారా?

వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డిపై టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ మండిపడ్డారు. రాజ్యసభలో ప్రధాని మోడీ కాళ్లకు విజయసాయిరెడ్డి మొక్కాలేదని గుండెలపై చేయి వేసుకుని చెపుతారా అంటూ నిలదీశారు.

మోడీ కాళ్ళు మొక్కలేదని విజయసాయి చెపుతారా?
, మంగళవారం, 27 మార్చి 2018 (15:03 IST)
వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డిపై టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ మండిపడ్డారు. రాజ్యసభలో ప్రధాని మోడీ కాళ్లకు విజయసాయిరెడ్డి మొక్కాలేదని గుండెలపై చేయి వేసుకుని చెపుతారా అంటూ నిలదీశారు. 
 
పార్లమెంటులో మోడీ కాళ్లపై పడతారని, బయటకు వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శలు గుప్పిస్తారని ఆగ్రహం వ్యక్తంచేశారు. మోడీ కాళ్లపై పడలేదననే విషయాన్ని గుండెపై చేయి వేసుకుని చెప్పాలని విజయసాయికి సవాల్ విసిరారు. రాష్ట్ర ప్రయోజనాలను విజయసాయి తాకట్టు పెడుతున్నారని విమర్శించారు. అవిశ్వాసం తీర్మానం పేరుతో వైసీపీ నాటకాలాడుతోందని... వైసీపీ అసలు బండారం మంగళవారం బయటపడిందని ఎద్దేవా చేశారు. 
 
మరో ఎంపీ కొనకళ్ళ నారాయణ మాట్లాడుతూ, ప్రధానికి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పాదాభివందనం చేయడంతో అతని నిజస్వరూపం బయటపడిందన్నారు. వైసీపీది చిత్తశుద్ది లేని పోరాటమన్నారు. ఎంపీల పదవులకు రాజీనామా చేసినా సంవత్సరం వరకు స్పీకర్ ఆమోదించకుండా ఒప్పందం కుదుర్చుకుంటారని ఆరోపించారు. రాష్ట్రంలో కోసం పోరాటం అంటూనే పాదాభివందనం చేస్తారని దుయ్యబట్టారు.
 
రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయానికి నిరసనగా కేంద్రం నుంచి బయటకు వచ్చామన్నారు. తాము ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై చర్చ జరుపకుండా బీజేపీ ప్రభుత్వం కుంటిసాకులు చెబుతూ పారిపోతోందని మండిపడ్డారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయం దేశవ్యాప్తంగా తెలుస్తుందనే తీర్మానంపై చర్చ జరుగనీయడం లేదని ఆరోపించారు. దమ్ముంటే... నిజాయితీ ఉంటే పార్లమెంట్ సాక్షిగా చర్చ జరపాలని ఎంపీ సవాల్ విసిరారు. 
 
ఇదిలావుంటే, హోదా కోసం టీడీపీ ఎంపీలు రాజీనామా చేయాలంటూ వైసీపీ, పవన్ నేతృత్వంలోని జనసేన పార్టీలు కూడా ఇటీవల డిమాండ్ చేశాయి. దీనిపై ఎంపీ, సినీ నటుడు మురళీ మోహన్ స్పందిస్తూ, టీడీపీ ఎంపీలు రాజీనామా చేస్తే పార్లమెంట్‌లో పోరాడేది ఎవరంటూ ఆయన ప్రశ్నించారు. కేంద్రంపై అవిశ్వాస నోటీసులు ఇచ్చి వైసీపీ నాటకాలాడుతోందని దుయ్యబట్టారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాయలేని భాషలో చంద్రబాబును దూషించిన విజయసాయి రెడ్డి