Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కులం - మతం లేని మహిళా న్యాయవాది : ధృవీకరణ పత్రం ఇచ్చిన తహసీల్దారు

Advertiesment
కులం - మతం లేని మహిళా న్యాయవాది : ధృవీకరణ పత్రం ఇచ్చిన తహసీల్దారు
, గురువారం, 14 ఫిబ్రవరి 2019 (15:53 IST)
ఒక మహిళ ఏ కులానికో, ఏ మతానికో చెందినది కాదంటూ తాహసీల్దారు కార్యాలయం ధృవీకరణ పత్రం జారీచేసింది. ఈ తరహా సర్టిఫికేట్ జారీకావడం దేశంలోనే ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ తరహా సర్టిఫికేట్‌ను పొందింది ఓ మహిళా న్యాయవాది. ఆమె పేరు స్నేహా. ఈ తరహా సర్టిఫికేట్‌ను తిరుపత్తూరు తాహసీల్దారు టీఎస్. సత్యమూర్తి జారీ చేసి స్వయంగా అందజేశారు. తొమ్మిదేళ్ళ పోరాటం తర్వాత ఆ మహిళా న్యాయవాది ఈ తరహా సర్టిఫికేట్‌ను పొందారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, తమిళనాడు రాష్ట్రంలోని వేలూరు జిల్లా తిరుపత్తూరు వాసి. పి.వి. ఆనంద్ కృష్ణన్ - మణిమొళి అనే దంపతుల కుమార్తె. వయసు 35. ఈమె ఓ న్యాయవాది. ఈమె భర్త పార్తీబరాజా. తిరుపత్తూరులోని ఓ కాలేజీలో ఆర్ట్స్ విభాగంలో లెక్చరర్‌గా పని చేస్తోంది. ఈమెకు ముగ్గురు పిల్లలు. 
 
తాను ఒక కులానికో, ఒక మతానికో చెందిన మహిళను కాదని ధృవీకరిస్తూ సర్టిఫికేట్‌ను జారీ చేయాలని స్థానిక తాహసిల్దారు కార్యాలయంలో గత 2010లో ఒక వినతిపత్రం సమర్పించింది. దీన్ని పలు కోణాల్లో పరిశీలించిన తాహసీల్దారు ఆమెకు ఈనెల 5వ తేదీన స్నేహా ఏ ఒక్క కులానికో, మతానికో చెందిన మహిళ కాదంటూ ధృవీకరణ పత్రాన్ని స్వయంగా అందజేశారు. కానీ, తాహసీల్దారు కార్యాలయం అలా సర్టిఫికేట్ ఇచ్చేందుకు ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంటూ తిరస్కరిస్తూ వచ్చారు. ఆ తర్వాత 2017 నుంచి తన వాదనను అధికారులకు బలంగా వినిపించినట్టు చెప్పారు. తనకు ప్రభుత్వ రాయితీలు, రిజర్వేషన్లు వద్దని అందువల్ల తనకు ఆ తరహా సర్టిఫికేట్ జారీ చేయాలని పదేపదే కోరినట్టు చెప్పారు. తన మొరను ఆలకించిన తిరుపత్తూరు సబ్ కలెక్టర్ ప్రియాంకా పంకజం తనకు సర్టిఫికేట్‌ను జారీ చేసేందుకు పచ్చజెండా ఊపారన్నారు. 
 
దీనిపై న్యాయవాది స్నేహా స్పందిస్తూ, తాను పాఠశాల నుంచి కాలేజీ విద్య ముగిసేంత వరకు కుల ధృవీకరణ పత్రాలు సమర్పించలేదన్నారు. తనకు ఎలాంటి కులమతాలు లేవని, కేవలం ఒక ఇండియన్ అని మాత్రమే తన తల్లిదండ్రులు చెప్పారన్నారు. అందుకే తన విద్యాభ్యాసం పూర్తయ్యేంత వరకు కులధృవీకరణ పత్రం సమర్పించలేదన్నారు. పైగా, తాను వివిధ కోర్సులను చదివేందుకు చేసుకున్న దరఖాస్తుల్లో కూడా కులం, మతం కాలాలను భర్తీ చేయకుండా, ఖాళీగా ఉంచి, నేషనాలిటీ కాలమ్‌లో మాత్రం ఇండియన్ అని రాసినట్టు గుర్తుచేసింది. తన ఇద్దరు సోదరీమణులకు చెందిన విద్యార్హత సర్టిఫికేట్లలో కూడా ఇండియన్ అని మాత్రమే రాశామని స్నేహా చెప్పుకొచ్చింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వివాహితకు అధిక వడ్డీకి డబ్బులు... కోర్కె తీర్చుతావా లేదా అంటూ వేధింపులు...