Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దేవేంద్ర ఫడ్నవిస్ బలమెంత? లైవ్‌లో 'మహా' బలపరీక్ష

దేవేంద్ర ఫడ్నవిస్ బలమెంత? లైవ్‌లో 'మహా' బలపరీక్ష
, మంగళవారం, 26 నవంబరు 2019 (13:54 IST)
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ వాస్తవబలమెంతో బుధవారం తేలిపోనుంది. సుప్రీంకోర్టు ఆదేశం మేరకు బుధవారం ఆ రాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్ష జరుగనుంది. ఇందులో విజయం సాధిస్తే దేవేంద్ర ఫడ్నవిస్ ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. లేనిపక్షంలో తన పదవికి రాజీనామా చేయాల్సివస్తుంది. 
 
కాగా, మహారాష్ట్రలో ఎన్సీపీ నేత అజిత్ పవార్‌ మద్దతుతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి వ్యతిరేకంగా విపక్షాలు సుప్రీంకోర్టుకెళ్లాయి. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు...కీలక ఆదేశాలు జారీచేసింది. బీజేపీ కూటమికి బలం ఉంటే, వెంటనే అసెంబ్లీని సమావేశపరచాలని, బల పరీక్షకు సిద్ధం కావాలని ఆదేశించింది. 
 
తమకు బలం ఉందని చెబుతూ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా ఆలస్యం చేయడం ఏంటని ఈ సందర్భంగా న్యాయమూర్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బల పరీక్ష అసెంబ్లీ వేదికగా జరగాలే తప్ప, రాజ్‌భవన్‌లో కాదని అన్నారు. బుధవారం సాయంత్రం 5 గంటల్లోగా విశ్వాస పరీక్ష జరగాలని ఆదేశించారు. 
 
పైగా, బల పరీక్షను సజావుగా నిర్వహించేందుకు ప్రొటెమ్ స్పీకర్‌ను తక్షణమే నియమించాలని, మొత్తం అసెంబ్లీ సమావేశాలను చిత్రీకరిస్తూ, లైవ్ టెలికాస్ట్ చేయాలని కూడా ఆదేశించించింది. బుధవారం ఉదయం నుంచి సాయంత్రంలోగా ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం పూర్తి కావాలని, ఆ వెంటనే బల పరీక్ష జరపాలని ఆదేశాలు జారీచేసింది. బల పరీక్షలో రహస్య ఓటింగ్‌ను జరపరాదని కూడా సూచించింది. దీంతో దేవంద్ర ఫడ్నవిస్ తన బలాన్ని అసెంబ్లీ వేదికగా నిరూపించుకోవాల్సి పరిస్థితి ఏర్పడింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అవినీతిపై 14400కి కాల్ చేసిన వర్ల రామయ్య