Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Jyoti Malhotra: కేరళ పర్యాటకాన్ని ప్రోత్సహిస్తున్న జ్యోతి మల్హోత్రా.. వీడియో వైరల్

Advertiesment
Jyoti Malhotra

సెల్వి

, సోమవారం, 7 జులై 2025 (11:40 IST)
Jyoti Malhotra
గూఢచర్యం ఆరోపణలపై అరెస్టయిన హర్యానాలోని సిర్సాకు చెందిన ట్రావెల్ వ్లాగర్ జ్యోతి మల్హోత్రా, కేరళ ప్రభుత్వం పర్యాటకాన్ని ప్రోత్సహించే ప్రచారంలో అతిథిగా పాల్గొన్నారు. కేరళ పర్యాటకాన్ని ప్రోత్సహించే దిశగా ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ జ్యోతి దక్షిణ రాష్ట్రాన్ని సందర్శించారు.
 
సమాచార హక్కు (RTI) చట్టం కింద ఒక ప్రశ్నలో, దక్షిణ రాష్ట్రాన్ని ప్రపంచ పర్యాటక గమ్యస్థానంగా ప్రోత్సహించడానికి ఎంపిక చేసిన 41 మంది ఇన్ఫ్లుయెన్సర్ల పర్యటనకు కేరళ ప్రభుత్వం నిధులు సమకూర్చిందని వెల్లడైంది. రాష్ట్ర ప్రభుత్వం వారి ప్రయాణం, వసతి, ఆహారం కోసం డబ్బులు చెల్లించింది. వారి బస సమయంలో వీడియోలను చిత్రీకరించడంలో వారికి సహాయం చేయడానికి ఇది ఒక ప్రైవేట్ ఏజెన్సీని నియమించింది. 
 
ఈ 41 మంది ఇన్ఫ్లుయెన్సర్లలో జ్యోతి మల్హోత్రా కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై ప్రతిపక్ష పార్టీలు రాష్ట్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా విమర్శలు గుప్పించాయి. దీంతో కేరళ పర్యాటక మంత్రి పీఏ మహమ్మద్ రియాస్ మాట్లాడుతూ, కేరళ పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి జ్యోతి మల్హోత్రాతో పాటు ఇతర ఇన్ఫ్లుయెన్సర్లను ఆహ్వానించారని అన్నారు. "ఇది కేరళను ప్రోత్సహించే లక్ష్యంతో జరిగిన పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ ప్రచారంలో భాగం. ప్రతిదీ పారదర్శకంగా, మంచి విశ్వాసంతో జరిగింది" అని చెప్పారు.
 
"ఇది గూఢచర్యానికి దోహదపడే ప్రభుత్వం కాదు. ప్రభుత్వ వ్యవస్థలు ఎలా పనిచేస్తాయో మీడియా అర్థం చేసుకోవాలి. దీనిని ఎవరూ ఊహించలేరు. రాష్ట్ర ప్రభుత్వం జ్యోతిని ఆహ్వానించడంపై చేస్తున్న ఆరోపణలు దండగ అని, రాష్ట్ర ప్రభుత్వం తెలిసి ఎన్నడూ ఒక గూఢచారిని ఆహ్వానించదని రియాస్ అన్నారు. కాగా జ్యోతి మల్హోత్రా కేరళ పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బీహార్ ప్రజల ఓటు హక్కులను లాక్కోవడానికి బీజపీ కుట్ర : కాంగ్రెస్