Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

sologamy: నన్ను నేనే పెళ్లి చేసుకున్నా, హనీమూన్‌కు గోవా వెళ్తున్నా

Advertiesment
sologamy
, గురువారం, 9 జూన్ 2022 (15:00 IST)
sologamy... సింగిల్ మ్యారేజ్ (సోలోగామి మ్యారేజ్) గురించి చాలా రోజులుగా చర్చల్లో వున్న క్షమాబిందు బుధవారం పెళ్లి చేసుకుంది. ఆమె అనుకున్న సమయానికి 3 రోజుల ముందు వివాహం చేసుకున్నది. ఎరుపు రంగు దుస్తుల(వధువు దుస్తులు)లో హిందూ అమ్మాయి పెళ్లిలాగే చేసుకుంది. ఒంటరిగా మంగళసూత్రం ధరించి ఏడు ప్రదక్షిణలు చేసింది.

 
పెళ్లి వేడుక పూర్తి చేసిన తర్వాత బిందు మాట్లాడుతూ.. ఎట్టకేలకు పెళ్లయినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పింది. ఆమె వివాహం జూన్ 11న జరగాల్సి ఉంది, కానీ ఆ రోజు ఆమె ఇంటివద్దకు పెద్దఎత్తున ఆందోళన చేసే అవకాశం ఉన్నందున, ఆమె తన పెళ్లి జూన్ 8న ముందుగానే చేసుకుంది.


ఈ వివాహానికి క్షమా స్నేహితులు, సన్నిహితులు కొందరు మాత్రమే హాజరయ్యారు. 40 నిమిషాల పాటు జరిగిన ఈ వేడుకకు పండిట్‌జి లేకపోవడంతో డిజిటల్ పద్ధతిలో పూర్తయింది. నృత్యాలు, ఆనందోత్సాహాల మధ్య పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి. భారతదేశంలో స్వీయ వివాహం చేసుకున్న మొదటి కేసు ఇదే అని చెపుతున్నారు.
webdunia

 
అంతకుముందు ఆమె గుడిలో పెళ్లి చేసుకుంటానని తెలిపింది. దీనితో ఆలయ పూజారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఐతే ఆలయంలో చేసుకోలేకపోయినా, పండిత్ కార్య క్రమానికి నిరాకరించినా బిందు వెనక్కి తగ్గ కుండా ఒంటరిగా పెళ్లి చేసుకుంది. పెళ్లి మంత్రాలను టేపులో ప్లే చేస్తూ పెళ్లి కార్యక్రమం నిర్వహించింది. సోలోగామి పెళ్లి గురించి ప్రకటించిన బిందు.. తానెప్పుడూ పెళ్లి చేసుకోవాలని అనుకోలేదనీ, పెళ్లికూతురు కావాలని కలలు కన్నానని, అందుకే తనను తానే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నానని చెప్పింది. ప్రస్తుతం హనీమూన్ కోసం గోవా వచ్చింది.

 
క్షమాబిందు ఇంతకుముందు తనలా దేశంలో ఒక మహిళ తనను తాను వివాహం చేసుకున్నదా అని అన్వేషించింది. ఇంటర్నెట్-ఇతర రికార్డులలో అలాంటి కేసులేవీ కనుగొనబడలేదు. దీనితో క్షమాబిందు తన సంకల్పం మరింత బలపడిందని చెప్పుకొచ్చింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పంజాబ్ గాయకుడు సిద్ధూను హత్య చేసిన నిందితుడు అరెస్టు