Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఉత్తర ద్వారం నుంచే విష్ణుమూర్తిని చూడాలా, ద్వారాలు బద్ధలవ్వాలా?: భక్తులకు సూటిగా గరికపాటి (video)

garikapati

ఐవీఆర్

, గురువారం, 9 జనవరి 2025 (11:53 IST)
పండుగలు, పర్వదినాలు వస్తే పుణ్యక్షేత్రాల్లో ఇసుకేస్తే రాలనంత భక్తులు వచ్చేస్తుంటారు. దీనిపై ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు గారు సూటింగా భక్తులను ఉద్దేశించి మాట్లాడారు.
 
''ముక్కోటి ఏకాదశి వంటి పర్వదినాలు వస్తే దేవాలయాలన్నీ కిటకిటలాడిపోతాయి. తిరుమల, భద్రాచలం ఇలా ఏ దేవాలయంలోనైనా భారీ సంఖ్యలో భక్తులు బారులుతీరి కనిపిస్తారు. ఆరోజు స్వామివారిని దర్శించుకుంటే చేసిన పాపాలన్నీ పోతాయట. అన్ని పాపాలు చేసి వెళ్తారా స్వామి వారి కటాక్షానికీ.. ముక్కోటి అయ్యాక 3 రోజులకు వెళితే విష్ణుమూర్తి ఏమైనా ఆగ్రహంగా వుంటారా... కరుణించరా.
 
ఒక్కసారిగా పెద్దసంఖ్యలో భక్తులు వెళితే తొక్కిసలాటలు, ప్రమాదాలు జరగకుండా ఎలా వుంటాయి. ఎందుకు ఆరోజే వెళ్లాలని పరుగులు తీస్తారు? శరీరాన్ని మించిన క్షేత్రం లేదు, మనసును మించిన తీర్థం లేదు. సత్ర్పవర్తన కలిగి వుంటే నీకు నువ్వే ఓ క్షేత్రం నీకు నువ్వే ఓ తీర్థం" అని చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇంటర్ విద్యలో సంస్కరణలు చేద్దామా లేదా? సూచనలు కోరిన ప్రభుత్వం