ఉత్తరాయనం దేవతలు పగలైతే, దక్షిణాయనం దేవతలకు రాత్రి. ఈ సమయంలో వారు నిద్రిస్తారని చెప్తారు. అందుకే విష్ణుమూర్తి కూడా శయన ఏకాదశి రోజు నుంచి నిద్రపోతాడని చెప్తారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం సూర్యడు ఈ రోజున కర్కాటక రాశిలో ప్రవేశిస్తాడు. ఈ రోజును కర్కాటక సంక్రాంతిగా పిలుస్తారు. నిజానికి దీక్షలు, పండుగలు వంటివి ఉత్తరాయణంలో కంటె దక్షిణాయనంలో ఎక్కువ.
ఉత్తరాయణం దేవతలకు ప్రాతినిధ్యం వహించేది కాగా, దక్షిణాయనం పితృదేవతలకు ప్రాతినిధ్యం వహించే కాలంగా పరిగణిస్తారు. ముఖ్యంగా దక్షిణాయనంలోనే పితృ దేవతలు తమ సంతానం ఇచ్చే విశేష శ్రాద్ధాలు, విశేష తర్పణాలు తీసుకునేందుకు భూమి పైకి వస్తారని చెబుతారు.
ఈ దక్షిణాయనంతోనే పితృదేవతల ఆరాధనకు సంబంధించిన మహాళయ పక్షాలు భాద్రపదమాసంలో వస్తాయి. ఈ దక్షిణాయనం జూలై 16న ప్రారంభం కానుంది.