అమెరికాలోని చికాగోలో ఓ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. రద్దీగా ఉండే టోల్ హైవే పైనే ఈ విమానాన్ని దిగడం గమనార్హం. విమానం ఇంజిన్‌లో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగానే ఇలా ఎమర్జెన్సీ ల్యాండింగ్ కావాల్సి వచ్చిందని ఇల్లినాయిస్ పోలీసులు తెలిపారు.
గురువారం ఉదయం 11.10 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ సమయంలో విమానంలో పైలట్‌తో కలిపి నలుగురు ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. నలుగురికి స్వల్ప గాయాలయ్యాయని తెలిపారు. దాంతో వారిని చికిత్స కోసం హూటాహూటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించామన్నారు.
ఇక ఎల్లప్పుడూ రద్దీగా ఉండే హైవేపై విమానం ల్యాండ్ కావడంతో దాదాపు నాలుగు గంటల పాటు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడినట్లు ఇల్లినాయిస్ పోలీసులు చెప్పారు.