Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Thursday, 10 April 2025
webdunia

అతిపెద్ద హైవే సొరంగ మార్గం సిద్ధం

Advertiesment
largest highway tunnel route
, శుక్రవారం, 18 సెప్టెంబరు 2020 (17:01 IST)
ప్రపంచంలోనే అతిపెద్ద హైవే సొరంగ మార్గం నిర్మాణం పూర్తైంది. దీన్ని అటల్‌ టన్నెల్‌(సొరంగం) లేదా రోహ్ తంగ్‌ టన్నెల్‌ అని కూడా పిలుస్తారు. 10వేల అడుగుల పొడవైన ఈ మార్గం మనాలి నుండి లేహ్ ను కలుపుతుంది.

దీని నిర్మాణాన్ని ఆరు సంవత్సరాల్లో పూర్తి చేయాలని అంచనా వేసినప్పటికీ..10 సంవత్సరాలు పట్టిందని చీఫ్‌ ఇంజనీర్‌ కెపి పురుషోత్తమ్‌ తెలిపారు. ప్రతి 60 మీటర్లకు సిసిటివిలు, 500 మీటర్ల చొప్పున అత్యవసర మార్గాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు.

ఈ సొరంగ మార్గం ద్వారా మనాలి, లేహ్ మధ్య 46 కిలోమీటర్ల మేర పొడవు, నాలుగు గంటల సమయం తగ్గనుంది. దీని నిర్మాణానికి 4వేల కోట్లు ఖర్చు అయినట్లు సమాచారం. ఏదైనా ప్రమాదం సంభవిస్తే...అగ్ని నియంత్రణ యంత్రాలను(ఫైర్‌ హైడ్రాంట్స్‌) వంటివి కూడా ఏర్పాటు చేశారు.

నిర్మాణ సమయంలో ఈ వనరులను అమర్చేందుకు, తొలగించేందుకు ఎంతో క్లిష్టతరమైందని ఇంజనీర్‌ తెలిపారు. ఎన్నో సవాళ్లను ఓర్చి..అంతా ఏకమై దీని నిర్మాణాన్ని పూర్తి చేశామని ఉద్వేగపూరితంగా చెప్పారు.

ఈ సొరంగం వెడల్పు 10.5 మీటర్లని, ఇరువైపులా 1 మీటర్‌ చొప్పున నడవను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ప్రాజెక్టు డైరెక్టర్‌ పరీక్షిత్‌ మెహ్ర మాట్లాడుతూ దీని నిర్మాణ బృందంలో భాగస్వామ్యులైన అనేక మంది నిపుణులు సొరంగం వరుసను మార్చాలని కోరినట్లు చెప్పారన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్పోర్ట్స్ బెట్టింగ్‌‌ను ప్రోత్సహిస్తున్న పేటీఎం .. గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగింపు