Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

స్నానం చేస్తూ ఆ పని చేసిన యువతి... చివరికి ఏమైందంటే?

Advertiesment
Russian girl
, సోమవారం, 15 ఏప్రియల్ 2019 (13:44 IST)
ప్రస్తుత కాలంలో సెల్‌ఫోన్ అనేది మనిషి శరీర భాగాల్లో ఒకటిగా మారిపోయింది. చాలా మంది ఎక్కడికి వెళ్లినా సరే చేతిలో సెల్‌ఫోన్ లేకుంటే ఏదో కోల్పోయిన భ్రమలో ఉంటారు. సరిగ్గా ఇలాంటి అలవాటే ఒక యువతి ప్రాణాలు తీసింది. వివరాల్లోకి వెళితే మాస్కోకు చెందిన ఇరవై ఏళ్ల అనస్తేసియా అనే యువతికి సాధారణంగా స్నానానికి వెళ్లే సమయంలో సెల్‌ఫోన్ తీసుకెళ్లడం అలవాటు. 
 
ఈ క్రమంలో ఒక రోజు స్నానానికి వెళ్తూ ఆ విషయాన్ని తన తల్లి 48 ఏళ్ల ఒక్సానాకు చెప్పింది. అది విని సరేనన్న ఆమె తల్లి తన నైట్‌షిఫ్ట్ ఉద్యోగానికి వెళ్లిపోయింది. ఉద్యోగం నుంచి ఉదయాన్నే ఇంటికొచ్చిన తల్లికి తన కూతురు కనిపించకపోగా ఇల్లంతా వెతికింది. ‘అనస్తేసియా’ అంటూ గట్టిగా కేకలు పెడుతూ కూతురి కోసం ఇల్లంతా గాలించింది.
 
చివరకు బాత్రూంలో లైటు వెలుగుతుండటం చూసి, తన కూతురు స్నానం చేస్తూ నిద్రపోతోందేమో అనుకొంది. కొద్దిసేపటికి స్నానాల గదిలోకి వెళ్లి చూస్తే ఖాళీ బాత్ టబ్‌లో కళ్లు మూసుకొని ఉన్న కూతురు కనిపించింది. ఆమె చేతిలో ఫోన్ ఉండటం చూసిన తల్లికి ఏదో అనుమానం వచ్చింది. ఆ ఫోన్‌కి చార్జింగ్ పెట్టి ఉండటం చూసి వెంటనే చార్చర్ స్విచ్ ఆఫ్ చేసింది. 
 
తొలుత షాక్ కొట్టడం వల్ల తన కూతురు స్పృహ తప్పిందని ఆమె భావించి వెంటనే అంబులెన్సుకు ఫోన్ చేసింది. హుటాహుటిన అక్కడకు చేరుకున్న అంబులెన్సు సిబ్బంది అప్పటికే అనస్తేసియా మరణించినట్లు తేల్చారు. స్నానం చేస్తున్న సమయంలో చార్చింగ్ పెట్టిన ఫోన్ నీళ్లలో పడిందని, దాంతోనే ఆమె మరణించిందని వారు తేల్చారు. ఇలాంటి ప్రమాదాలను నివారించడానికి ఒకే మార్గం ఉందని, దయచేసి స్నానాల గదిలోకి ఫోన్ తీసుకెళ్ల వద్దని కోరారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆరు భాషల్లో బీబీసీ వాయిస్ యాక్టివేట్ బులిటన్