Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆసియాలోనే చెత్త తిరోగమనం.. ఆగస్టులో రూపాయికి కష్టం..

Advertiesment
ఆసియాలోనే చెత్త తిరోగమనం.. ఆగస్టులో రూపాయికి కష్టం..
, బుధవారం, 21 ఆగస్టు 2019 (13:27 IST)
ఆసియాలోనే రూపాయి విలువ చెత్తగా నమోదైంది. ముఖ్యంగా ఆగస్టులో అమెరికా డాలర్‌తో పోలిస్తే.. రూపాయి విలువ 3.49 శాతం తిరోగమనాన్ని నమోదు చేసుకుంది. ఈ కరెన్సీ గత నాలుగేళ్లలో రెండో చెత్త నెలవారీ నష్టాన్ని ఎదుర్కొంది. ఆర్బీఐ సవరించిన వృద్ధి రేటు తర్వాత, ఆటోమొబైల్ అమ్మకాలలో స్థిరమైన తగ్గుదల ఏర్పడటంతో.. భారతీయ రూపాయి ఒక డాలర్‌కు 71.4 రూపాయల వద్దకు చేరుకుంది. 
 
అలాగే ఆగస్టులో ఇది అత్యధికంగా ఆసియాలో చెత్త తిరోగమనం వైపు భారత కరెన్సీ మారింది. ప్రపంచ కరెన్సీలతో పోటీపడేందుకు భారత కరెన్సీ చాలా కష్టాలను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా ఆగస్టులో మాత్రం ఆసియాలోనే భారత కరెన్సీకి తిరోగమనం తప్పలేదు.
 
దీనిపై ఫస్ట్‌రాండ్ బ్యాంక్‌లోని కోశాధికారి, గ్లోబల్ మార్కెట్ల అధిపతి హరిహర్ కృష్ణమూర్తి బ్లూమ్‌బెర్గ్‌క్వింట్‌తో మాట్లాడుతూ, రూపాయి కదలికకు చాలా అంశాలున్నాయన్నారు. చైనా యువాన్‌పై అమెరికా అదనపు సుంకాలు, అర్జెంటీనా పెసోలో పడిపోవడం, గత తొమ్మిది నెలల్లో అతిపెద్ద ఫారిన్ కరెన్సీ ఫ్లో భారత రూపాయిపై పడటమే.. ఈ పేలవమైన రికార్డుకు కారణమని చెప్పారు. 
 
ఆర్థిక ఉద్ధీపన, బ్లూమ్ బెర్గ్ డేటా ప్రకారం పదేళ్ల బాండ్ దిగుబడి.. పది బేసిన్ పాయింట్లు పెరిగి 6.62 శాతానికి చేరుకుంది. బాండ్ దిగుబడి లాంటి ద్రవ్యోల్బణం, వడ్డీ రేటుతో ముడిపడి ఉన్న ఇతర అంశాలు పాజిటివ్‌లో ఉన్నాయి. ఈ పెరుగుదల ఆదాయాన్నిచ్చినా.. ఆ రెవిన్యూ భయంతో కూడుకున్నదని కృష్ణమూర్తి చెప్పారు.
 
డాలర్‌తో పోలిస్తే రూపాయి 69.23 స్థాయిని అధిగమించింది. దాని కంటే గణనీయంగా ఉంది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ లిమిటెడ్‌లోని ట్రెజరీ సలహాదారు ప్రాంతీయ అధిపతి భాస్కర పాండా మాట్లాడుతూ, సాంకేతికంగా ఇది డాలర్‌కు రూపాయి విలువ తగ్గుతుందని భావించే స్థాయికి సంబంధించిందన్నారు. ఇంకా టెక్నికల్‌గా చెప్పాలంటే.. రూపాయి విలువ డాలర్‌కు 72.12 కావచ్చు. 
 
అయితే, స్వల్పకాలంలో రూపాయి 70.5 నుంచి 71.5 డాలర్ల మధ్య ఉంటుందని కృష్ణమూర్తి అభిప్రాయపడ్డారు. ఒకవేళ చైనా, అమెరికా సంవత్సరాంతానికి ఆమోదయోగ్యమైన ఒప్పందం కుదుర్చుకుంటే, డాలర్‌కు రూపాయి 70 డాలర్లుగా ఉంటుందని కృష్ణమూర్తి అభిప్రాయపడ్డారు. 
 
రూపాయిలో పదునైన తగ్గుదల అంటే, రూపాయి ఆఫ్-షోర్ పెట్టుబడిదారులకు వారు పొందే లాభాలను చాలావరకు తుడిచిపెట్టేస్తుంది. దేశం నుండి స్వల్పకాలిక రుణ పెట్టుబడుల కోసం కరెన్సీ నష్టాలను కాపాడటంలో అందరూ పాల్గొనాలి. రూపాయిలో ఈ తగ్గుదల అదుపులో ఉంచకపోతే, క్యారీ ట్రేడ్‌లు ఎక్కువగా ఇన్‌బౌండ్ పెట్టుబడులను రూపాయి బాండ్లలోకి తీసుకురావడానికి ప్రధాన కారణమవుతుంది. ఇది ప్రమాదమని ముంబైకి చెందిన కరెన్సీ రిస్క్ అడ్వైజరీ అయిన క్వాంట్ఆర్ట్ మార్కెట్ సొల్యూషన్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సమీర్ లోధా హెచ్చరించారు. అలాంటిది జరిగితే, అది డాలర్‌కు 74 వరకు వెళ్ళవచ్చునని లోధా చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బుద్ధిమార్చుకోని డోనాల్డ్ ట్రంప్... కాశ్మీర్‌పై మధ్యవర్తిత్వం వహిస్తానంటూ ట్వీట్