ప్రముఖ సినీ నటి తమిళనాడు కాంగ్రెస్ నాయకురాలికి గుర్తు తెలియని వ్యక్తి నుంచి బెదిరింపులు వచ్చాయి. అత్యాచారం చేసి చంపేస్తానంటూ ఓ వ్యక్తి ఫోన్ చేసి బెదిరించాడు. అయితే ఆ కాల్ పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చిందని ట్రుకాల్ ద్వారా తెలుసుకున్న ఖుష్బూ ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
ఆ వ్యక్తి నంబర్‌ను కూడా షేర్ చేసారు. అంతేకాదు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కూడా షేర్ చేసారు. నా వంటి వ్యక్తులకే బెదిరింపులు ఎదురవుతాయంటే ఇతర మహిళల పరిస్థితి ఏమవుతుందని ఖుష్బూ ప్రశ్నించారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన వ్యక్తుల పరువును పబ్లిక్‌గా తీయాలని తెలిపారు.
ఇటీవల కాలంలో ఖుష్బూ సోషల్ మీడియా వేదికగా పలు సంచలన కామెంట్లు చేసారు. జాతీయ విద్యావిధానం విషయంలో సోంత పార్టీ నేత రాహుల్ గాంధీకి వ్యతిరేఖంగా స్పందించారు. ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ రాముడి కంటే మోదీని ఎక్కువ చేస్తున్నారంటూ బీజేపీపై మండిపడ్డారు.