ఆదాయపన్ను రద్దు : ఇదే మోడీ పంద్రాగస్టు దినోత్సవ కానుక?
కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వంపై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేక నెలకొంది. దీన్ని తగ్గించే దిశగా ప్రధాని మోడీతో పాటు బీజేపీ పాలకులు చర్యలు చేపడుతున్నారు. ఇందులోభాగంగా, వచ్చే నెల 15వ తేదీ
కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వంపై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేక నెలకొంది. దీన్ని తగ్గించే దిశగా ప్రధాని మోడీతో పాటు బీజేపీ పాలకులు చర్యలు చేపడుతున్నారు. ఇందులోభాగంగా, వచ్చే నెల 15వ తేదీన జరుగనున్న పంద్రాగస్టు వేడుకల రోజున ఆదాయపన్నును పూర్తిగా రద్దుపై ప్రధాని ఓ ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.
దీనికి కారణాలు లేకపోలేదు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించాలంటే, కేంద్ర ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న ఆగ్రహాన్ని చల్లార్చి ఉంది. ఇందుకోసం ప్రధాని నరేంద్ర మోడీ, సంచలన నిర్ణయాన్ని ప్రకటించనున్నారని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. జీఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత, కేంద్రానికి పన్ను ఆదాయం గణనీయంగా పెరగింది. అలాగే, బ్యాంకు లావాదేవీల సంఖ్య పెరగడంతో వ్యక్తుల నుంచి ఆదాయపు పన్ను వసూళ్లను రద్దు చేయాలని ఆయన భావిస్తున్నట్టు సమాచారం.
ఈ సంవత్సరం ఆగస్టు 15న ఎర్రకోటపై నుంచి ప్రసంగించే వేళ, తన నోటివెంట ఈ నిర్ణయాన్ని ఆయన ప్రకటిస్తారని బీజేపీ నేతలు అంటున్నారు. నోట్ల రద్దు, జీఎస్టీ వంటి నిర్ణయాలు బాంబుల్లా పేలి, మోడీపై ప్రజా వ్యతిరేకతను పెంచగా, దాన్ని తగ్గించకుంటే, గెలుపు క్లిష్టతరమవుతుందన్న ఆలోచనలో సునామీ తరహాలో సానుకూల పవనాలు వీచేందుకు ఏం చేయాలని ఆలోచించిన కమలనాథులు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు సమాచారం.