Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 21 March 2025
webdunia

సైరా ఫంక్ష‌న్‌లో అంద‌రికీ షాక్ ఇచ్చిన ప‌వ‌న్... ఇంత‌కీ ఏం చేసాడు..? (video)

Advertiesment
సైరా ఫంక్ష‌న్‌లో అంద‌రికీ షాక్ ఇచ్చిన ప‌వ‌న్... ఇంత‌కీ ఏం చేసాడు..? (video)
, సోమవారం, 23 సెప్టెంబరు 2019 (12:45 IST)
మెగాస్టార్ చిరంజీవి న‌టించిన సంచ‌ల‌న చిత్రం సైరా న‌ర‌సింహారెడ్డి. స్టైలీష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ భారీ చిత్రం సైరా న‌ర‌సింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ముఖ్య అతిధిగా హాజ‌ర‌య్యారు. ఆయ‌న ఈ వేడుక‌కు వ‌స్తున్నార‌ని తెలిసిన‌ప్ప‌టి నుంచి... ఎప్పుడెప్పుడు చిరు, ప‌వ‌న్‌ని ఈ వేదికపై చూస్తామా అని అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసారు.
 
ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే... ఈ వేడుక‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ మాట్లాడుతుండగా ఆశ్చర్యకరమైన ఘటన జరిగింది. తన ప్రసంగాన్ని కొనసాగించే క్రమంలో రాకెట్‌లా వేదిక పైకి ఓ అభిమాని దూసుకువ‌చ్చి పవన్‌కు పాదాభివందనం చేసే ప్రయత్నం చేశాడు. ఇంతలో సెక్యూరిటీ సిబ్బంది వచ్చి ఆ అభిమానిని బలవంతంగా అక్కడ్నించి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.
webdunia
 
అప్పుడు.. మీరందరూ వెళ్లిపోండి అంటూ పవన్ వారికి హిందీలో చెప్పినా ఆ సెక్యూరిటీ సిబ్బంది వినకపోవడంతో గట్టిగా అరిచారు. ఆప్ లోగ్ చలే జాయియే భాయ్ అంటూ మొదట తక్కువ టోన్‌తో చెప్పిన జనసేనాని ఆ తర్వాత చలీయే ఆప్ అంటూ టోన్ పెంచ‌డంతో సెక్యూరిటీ సిబ్బంది వెనక్కి తగ్గారు. దాంతో ఆ అభిమాని పవన్‌ను ఆనందంతో హత్తుకుని మురిసిపోయాడు. అనంతరం పవన్ తన ప్రసంగం కొనసాగించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సచివాలయం ఉద్యోగాలు.. 27న అపాయింట్‌మెంట్ లెటర్స్..