Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

40 యేళ్ళ క్రితమే కరోనా వైరస్... ది ఐస్ ఆఫ్ డార్క్‌నెస్ పుస్తకంలో...

Advertiesment
Coronavirus
చైనా దేశాన్ని కబళించిన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటికే 1700 మంది ప్రాణాలు తీసిన ఈ వైరస్... వుహాన్ నగరం కేంద్ర బిందువుగా ఉన్న విషయం తెల్సిందే. ఈ వైరస్ ప్రస్తుతం 25 దేశాల్లో విస్తరించింది. అయితే, ఈ వైరస్ గురించి ఓ ఆసక్తికరమైన అంశమొకటి వెలుగులోకివచ్చింది. దాదాపు 40 యేళ్ళ క్రితమే ఓ రచయిత ఫిక్సన్ నవలలో ఈ వైరస్ గురించి ప్రస్తావించినట్టు తాజాగా వెల్లడైంది. ఆ పుస్తకం పేరు ది ఐస్ ఆఫ్ డార్క్‌నెస్. 
 
ఇందులో ఈ వైరస్ గురించి నవలా రచయిత డీన్ కుంట్జ్ 1981లోనే ప్రస్తావించివుండటం గమనార్హం. అపుడు ఈ వైరస్‌‌ను వుహాన్-400గా పిలిచారు. దీనికి సంబంధించిన ఓ పోస్ట్‌ను ట్విట్టర్‌లో వైరల్ అయింది. ఇందులో నవల పేరుతో పాటు అందులో పేర్కొన్న అంశాలతో పాటు వైరస్ గురించి ప్రస్తావించారు. ముఖ్యంగా, ఈ వైరస్‌ వ్యాప్తి, ప్రభావంతో పాటు.. వైరస్ లక్షణాలను ఇందులో ప్రస్తావించడం గమనార్హం. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ కాగా, దీనిపై అనేక మంది నెటిజన్లు స్పందిస్తున్నారు. 
 
కరోనా మృతులు 1700 
మరోవైపు, కరోనా వైరస్ దెబ్బకు చైనా కకావికలమైపోతోంది. ఈ వైరస్ రోజురోజుకూ మరింతగా విస్తరిస్తోంది. ఫలితంగా మృతుల సంఖ్య కూడా విపరీతంగా పెరిగిపోతంది. ఇప్పటివరకు ఈ వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 1770కు చేరింది. హుబే ప్రావిన్స్‌లో ఒక్క రోజులోనే 100 మంది ప్రాణాలు కోల్పోయారు.
 
అదేసమయంలో చైనాలో కొత్తగా 2018 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తంగా కోవిద్‌-19 వైరస్‌ బాధితుల సంఖ్య 70,548కి చేరింది. ఈ వ్యాధితో ఆస్పత్రుల్లో చేరికోలుకున్న తర్వాత 10,844 మంది డిశ్చార్జి అయ్యారు. ఈ వ్యాధిని అరికట్టేందుకు చైనా అధికారులు బహిరంగ ప్రదేశాల్లో ఆంక్షలు విధించారు. 
 
మరోవైపు, పాన్‌ తీరంలో నిలిపేసిన 'డైమండ్‌ ప్రిన్సెస్' నౌకలో కోవిడ్-19 సోకిన వారి సంఖ్య ఆదివారానికి 355కి పెరిగింది. అందులోభారత్‌ సహా 50 దేశాలకు చెందిన 3700 మంది ఉన్నారు. ఆ నౌకలో నుంచి తమ వారిని తీసుకువెళ్లేందుకు అమెరికా, కెనడా సహా పలు దేశాలు ప్రయత్నాలు ప్రారంభించాయి.

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెదేపా పని అయిపోయిందనుకున్నా ... గంటా శ్రీనివాసరావు