Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చంద్రబాబు అవిశ్వాస అస్త్రం : మోడీ - షా ద్వయానికి ముచ్చెమటలు

టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంపై ప్రయోగించిన అవిశ్వాస అస్త్రం దెబ్బకు ఢిల్లీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ముఖ్యంగా, కమలనాథులను ఉలిక్కిపడేలా చేశా

Advertiesment
చంద్రబాబు అవిశ్వాస అస్త్రం : మోడీ - షా ద్వయానికి ముచ్చెమటలు
, శనివారం, 17 మార్చి 2018 (09:05 IST)
టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంపై ప్రయోగించిన అవిశ్వాస అస్త్రం దెబ్బకు ఢిల్లీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ముఖ్యంగా, కమలనాథులను ఉలిక్కిపడేలా చేశాయి. అంతలోనే తేరుకున్న బీజేపీ పెద్దలు.. అవిశ్వాస పరీక్షే జరుగకుండా సరికొత్త కుట్రలకు శ్రీకారం చుట్టారు. ఇందుకోసం తొలిరోజే అన్నాడీఎంకే సభ్యులను ఉసిగొలిచి సభలో గందరగోళం సృష్టించారు. దీన్ని సాకుగా చూపిన స్పీకర్ సుమిత్రా మహాజన్ సభ ఆర్డర్‌లో లేదంటూ అవిశ్వాస తీర్మాన నోటీసును స్వీకరించకుండా అడ్డుకోగలిగారు. 
 
మరోవైపు, తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలిపేందుకు తృణమూల్‌ కాంగ్రెస్‌, సమాజ్‌వాది సహా అనేక పార్టీలు ముందుకొచ్చాయి. చివరకు కాంగ్రెస్‌ పార్టీ సైతం సంపూర్ణ మద్దతు పలికింది. మరోవైపు అకాలీదళ్‌ కూడా తెలుగుదేశంతో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతోంది. టీడీపీ అవిశ్వాస తీర్మానానికి సంఘీభావం ప్రకటిస్తున్నామని అకాలీదళ్‌ నేత నరేశ్‌ గుజ్రాల్‌ ప్రకటించారు. 
 
ఇక వెస్ట్‌బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్వయంగా ఫోన్ చేసి చంద్రబాబుతో మాట్లాడారు. టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలిపామని టీఎంసీ నేత దినేశ్‌ త్రివేదీ చెప్పారు. అలాగే, ఎస్పీ అధినేత ములాయం సింగ్ కూడా చంద్రబాబుతో ఫోనులో సంభాషించారు. ఆ పార్టీ నేత రాంగోపాల్‌ యాదవ్‌ పార్లమెంట్‌ సెంట్రల్‌ హాలు నుంచి చంద్రబాబుతో మాట్లాడారు. 
 
ఇదిలావుంటే, లోక్‌సభలో బీజేపీ సంఖ్యాబలం 274 కాగా.. కాంగ్రెస్‌ సహా మిగతా పక్షాల బలం 265. అంటే బీజేపీకి, బీజేపీయేతర పార్టీలకూ మధ్య 9 మంది సభ్యుల తేడా మాత్రమే ఉంది. ఎన్డీయేలో ఉన్నప్పటికీ శివసేన బీజేపీపై ఆగ్రహంతో ఉంది. బీహార్‌లో నితీశ్‌కుమార్‌తో బీజేపీ చెలిమిపై లోక్‌‌జనశక్తి, రాష్ట్రీయ లోక్‌ సమతా పార్టీ కూడా అసంతృప్తితో ఉన్నాయి. బీజేపీలో సైతం పలువురు ఎంపీలు పార్టీ తీరుపట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. విప్‌ జారీ చేసినా బీజేపీ ఎంపీలు పూర్తిస్థాయిలో వచ్చే పరిస్థితి కనపడడం లేదు. 
 
అందువల్ల ఇప్పుడు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే ప్రధాని నరేంద్ర మోడీ పని తీరు పట్ల వ్యతిరేకంగా ఉన్న ఎంపీలంతా ఏకమవుతారనే భయం మోడీ - అమిత్ షా ద్వయానికి పట్టుకుంది. అపుడు అవిశ్వాస తీర్మానం వీగిపోయేలా చేయడానికి తీవ్రంగా కష్టపడాల్సి వస్తుందని అమిత్‌ షా, మోడీ భావిస్తున్నట్లు సమాచారం. అందుకే అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా చేసేందుకే బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాంగ్రెస్ ప్లీనరీలో ప్రత్యేక హోదా తీర్మానం.. సోనియా నిర్ణయం