Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సంపూర్ణేష్ బాబు ''అరటిపండు'' ఫైట్‌కు ఇండోనేషియా ఫ్యాన్స్ ఫిదా (వీడియో)

Advertiesment
సంపూర్ణేష్ బాబు ''అరటిపండు'' ఫైట్‌కు ఇండోనేషియా ఫ్యాన్స్ ఫిదా (వీడియో)
, మంగళవారం, 8 జనవరి 2019 (13:10 IST)
బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబుకు నెట్టింట వున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. సోషల్ మీడియాలో సంపూర్ణేష్ బాబు నటించిన హృదయం కాలేయం, సింగం 123 వంటి సినిమా వైరల్ హిట్ అయ్యాయి. తాజాగా సంపూర్ణేష్‌ బాబుకు భారత్‌లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ పెరిగిపోయారు. తాజాగా ఇండోనేషియాలో సంపూర్ణేష్ సినిమాల కోసం వెతికే ఫ్యాన్స్ ఎక్కువైపోతున్నారు. 
 
సంపూర్ణేష్ సినిమాలను ఇండోనేషియా సినీ ప్రేక్షకులు కూడా చూసి ఫిదా అయిపోయారు. ఈ క్రమంలో సింగం 123 సినిమాలో ఓ అరటిపండు తొక్కతీసి.. దాన్నే కత్తిలా వాడి అందరిపై దాడి చేస్తాడు సంపూర్ణేష్. ఈ సీన్ చూసిన ఇండోనేషియా ఫ్యాన్స్ మైండ్ బ్లాంక్ అయ్యింది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ ఇండోనేషియా ట్విట్టర్లో దీనిపై ఐదువేల మందికి పైగా చర్చించుకుంటున్నారు. 
 
ఇండొనేసియాలోని ఓ వ్యక్తి తన ట్విట్టర్ అకౌంట్‌లో ఈ చిన్న వీడియోను పోస్ట్ చేశాడు. దీన్ని రీ ట్వీట్ చేసిన నెట్ ‌ఫ్లిక్స్ ఇండొనేసియా.. ''ఈ సినిమా మొత్తం చూడాలనుకుంటున్నాం'' అంటూ నెట్ ఫ్లిక్స్ ఇండియాను ట్యాగ్ చేశారు. 2015లో సంపూ హీరోగా నటించిన ''సింగం 123'' ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. 
 
ఓ అరటి పండుతో చాలామంది విలన్లను సంపూర్ణేష్ భలే పడగొట్టాడని ఇండోనేషియా సినీ ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. ఇంకేముంది.. సంపూర్ణేష్ సింగం 123 సినిమా మొత్తం చూడాలనుకుంటున్నామని ఇండోనేషియా ఫ్యాన్స్ అడిగితే తరువాయి.. సంపూర్ణేష్ సినిమాలకు సంబంధించిన వీడియోలు ట్విట్టర్లో పోస్టు చేయడం జరిగిపోయింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కన్న కూతురుపై రేప్... సోదరులను కూడా పిలిచి గ్యాంగ్ రేప్...