Delhi Election Results 2025: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ శనివారం ఉదయం నుంచి ప్రారంభమైన నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) యంగ్ ఫ్యాన్ అవ్యాన్ తోమర్.. ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను తరహాలో కనిపించాడు. అంటే జూనియర్ అరవింద్ కేజ్రీవాల్‌లా కనిపించాడు. అవ్యాన్ కేజ్రీవాల్ సిగ్నేచర్ లుక్‌లో ధరించి, ప్రజలను ఆకట్టుకున్నాడు.
అవ్యాన్ నీలిరంగు స్వెటర్, తెల్లటి కాలర్ షర్ట్, ఆకుపచ్చ పఫర్ జాకెట్ ధరించి కనిపించాడు. మెడలో నల్లటి మఫ్లర్ కూడా ధరించాడు. మీసాలు కూడా పెట్టుకుని అచ్చం అరవింద్ కేజ్రీవాల్‌లా కనిపించాడు.
ఇకపోతే.. అవ్యాన్ తండ్రి రాహుల్ తోమర్, ప్రతి ఎన్నికల ఫలితాల రోజున కేజ్రీవాల్ ఇంటి వద్దకు రావడం ఒక అలవాటుగా చేసుకున్నారు. ఆప్ పార్టీకి మద్దతు తెలిపే దిశగా అవ్యాన్‌ను "బేబీ మఫ్లర్ మ్యాన్" అని ముద్దుపేరు పెట్టి అక్కడకు తీసుకెళ్లారు.
అవ్యాన్ దృష్టిని ఆకర్షించడం ఇదే మొదటిసారి కాదు. 2022 ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల సమయంలో, అతను అదేవిధంగా ప్రజల ఆసక్తిని ఆకర్షించాడు. ఆ ఎన్నికలలో ఆప్ విజయం సాధించిన తర్వాత, అవ్యాన్ తోటి పిల్లలతో కలిసి సంబరాలు చేసుకున్నాడు. ప్రస్తుతం అవ్యాన్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.