Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కాశ్మీర్ లోయలో షాపులు, పాఠశాలలు తెరవొద్దు.. ఉగ్రవాదుల పోస్టర్లు

Advertiesment
Pakistan
, శనివారం, 31 ఆగస్టు 2019 (12:24 IST)
కాశ్మీర్ లోయలో షాపులు, పాఠశాలలను తెరవవద్దని ప్రజలను బెదిరిస్తూ ఉగ్రవాదులు పోస్టర్లు వేశారు. జమ్మూకాశ్మీర్‌లో గతంలో అమలులో ఉన్న ఆర్టికల్ 370ని రద్దు చేసి, రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందుజాగ్రత్తగా కేంద్రం సెక్యూరిటీ బలగాలను మోహరించింది. 
 
షాపులు, పాఠశాలలు, కార్యాలయాలను మూసివేశారు. షాపులు, పాఠశాలలు తెరచినా, రోడ్లపై ప్రైవేటు వాహనాలు తిరిగినా చర్యలు తీసుకుంటామని హిజ్బుల్ ముజాహిదీన్, లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థల పేరిట హెచ్చరిస్తూ కాశ్మీర్ లోయలో పోస్టర్లు వెలిశాయి. ''కొన్ని ప్రైవేటు వాహనాలు రోడ్లపై తిరుగుతున్నాయని, పాఠశాలలు కూడా తెరిచారని, రోడ్లపై మహిళలు తిరుగుతున్నారని, ఈ నేపథ్యంలో తాము తుది హెచ్చరిక జారీ చేస్తున్నామని ఉగ్రవాదులు హెచ్చరించారు.
 
కాశ్మీర్‌లో క్రమేణా సాధారణ పరిస్థితులు నెలకొంటుండగా ఉగ్రవాదులు హెచ్చరికలు జారీ చేస్తూ పోస్టర్లు వేశారని కేంద్ర భద్రతాధికారులు చెప్పారు. పుల్వామా జిల్లాతోపాటు అనంత్‌నాగ్ నగరంలోని అష్ ముఖం మార్కెట్‌లో దుకాణాలు తెరచిన వ్యాపారులను నలుగురు ఉగ్రవాదులు బెదిరించారు. దుకాణాలు తెరిస్తే వాటిని దహనం చేస్తామని ఉగ్రవాదులు హెచ్చరించారని ఆర్మీవర్గాలు వెల్లడించాయి. 
 
శ్రీనగర్‌లోని పరింపొర ప్రాంతంలో శుక్రవారం దుకాణం తెరచిన యజమాని గులాం ముహమ్మద్ పై ఓ మిలిటెంట్ కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో దుకాణాదారు గులాం ముహమ్మద్ మరణించాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జగన్ సర్కారు జానపద అకాడమీ కమిటీని ఏర్పాటు చేయాల్సిందే..