మందు తాగితే ఆ మత్తులో జరిగేదేదీ తెలియక చాలామంది తికమకపడుతుంటారు. ఏవో కష్టాలున్నాయని, బాధలో మందు తాగుతామని మందుబాబులు అంటుంటారు. తాగిన మైకంలో వారి ముందు ఏది జరిగినా ఏదో పట్టనట్లు వుండిపోతుంటారు. 
 
 			
 
 			
					
			        							
								
																	
	 
	తాజాగా ఓ మందు బాబు తాగిన మైకంలో పులి ముందు కనిపించినా పిల్లి అనుకున్నాడు. ఫుల్‌గా తాగిన ఆ మందు బాబు.. మిగిలిన బీర్‌లో కొంత మొత్తాన్ని పులికి తాపబోయాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ పెంచ్ నేషనల్ పార్కుకు సమీపంలో చోటుచేసుకుంది.
	 
	తెల్లవారుజామున 3 గంటల సమయంలో మద్యం తాగుతూ వెళ్తున్న రాజు పటేల్ అనే వ్యక్తికి పులి ఎదురుపడింది. అయితే పటేల్ మద్యం మత్తులో అది పెద్ద పిల్లి అనుకొని దానికి బీర్ తాగించబోయాడు. పులి ఎంత సేపటికి తాగకపోయేసరికి పటేల్ తన దారిన పోయాడు. 
	 
	పులి రాజు కూడా ఆ మందు బాబు తల నిమురుతుంటే కామ్‌గా చూస్తుండి పోయింది. తర్వాత మందు బాబు అక్కడ నుంచి వెళ్లిపోయాక పులి కూడా తన దారిన వెళ్లిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అయితే ఇది ఫ్యాక్ట్ చెకర్స్ ఈ క్లిప్ ఏఐ ద్వారా సృష్టించబడిందని, ఇది వాస్తవ సంఘటన కాదని ఇప్పటికే నిర్ధారించారు.