Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

#Chandrayaan2 జాబిల్లిపై అగాధాలు... కెమెరాలో బంధించిన చంద్రయాన్-2

Advertiesment
#Chandrayaan2 జాబిల్లిపై అగాధాలు... కెమెరాలో బంధించిన చంద్రయాన్-2
, సోమవారం, 26 ఆగస్టు 2019 (18:18 IST)
చంద్రుడుపై ఉన్న అగాధాలను చంద్రయాన్-2కు అమర్చిన కెమెరాలు బంధించాయి. ఈ ఫోటోలను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో సోమవారం తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2ను ఇస్రో గత నెల 22వ తేదీన చంద్రమండలంపైకి పంపిన విషయం తెల్సిందే. 
 
చంద్రయాన్ 2 మిషన్‌లోని ల్యాండర్, రోవర్ సెప్టెంబర్ 7న తెల్లవారు జామున 1.40 నిమిషాలకు చంద్రుడిపై ల్యాండ్ కానున్నాయి. ఈ మొత్తం ప్రక్రియ 15 నిమిషాల్లో పూర్తి కానుందని అధికారులు వెల్లడించారు. 
 
అయితే, చంద్రయాన్ చంద్రుడు కక్ష్యలోకి ప్రవేశించిన తర్వాత తొలి అద్భుతాన్ని ఆవిష్కరించింది. చంద్రుడిని తన కెమెరాలో బంధించిన చిత్రాన్ని భూమిపైకి పంపింది. ఎల్-14 కెమెరాతో రాత్రి సమయంలో చంద్రయాన్-2 ల్యాండర్ చిత్రీకరించిన ఫోటోను ఇస్రో విడుదల చేసింది. 
 
ఇక ఈ ఫోటోను ట్వీట్ చేసిన ఇస్రో, చంద్రుడి దక్షిణార్ధగోళంలో ఉన్న అపోలో క్రేటర్స్‌ బిలం, పశ్చిమ అంచులో ఉన్న మేర్‌ ఓరియంటేల్‌ అనే మరొక పెద్ద బిలాన్ని చిత్రంలో చూడవచ్చని పేర్కొంది. 
 
ఇదిలావుంటే తాజాగా సమాచారాన్ని ఇస్రో అప్డేట్ చేసింది. చంద్ర‌యాన్ ‌2 వ్యోమ‌నౌక‌లో ఉన్న టెర్రేయిన్ మ్యాపింగ్ కెమెరా-2(టీఎంసీ-2) తీసిన ఫోటోల‌ను వెల్లడించింది. ఆగ‌స్టు 23వ తేదీన చంద్రయాన్‌ 2లో ఉన్న కెమెరాకు ఈ ఫోటోలు చిక్కాయి. చంద్రుడి ఉప‌రిత‌లంపై ఉన్న అగాధాల‌ను ఆ కెమెరా చిత్రీక‌రించింది. జాక్స‌న్‌, మాచ్‌, కొర‌లేవ్‌, మిత్రా లాంటి క్రేట‌ర్స్ క‌నిపించిన‌ట్లు ఇస్రో చెప్పింది. 
 
మిత్రా అగాధానికి ప్రొఫెస‌ర్ సిసిర్ కుమార్ మిత్ర పేరు పెట్టారు. ప్రొఫెస‌ర్ మిత్రా భూగోళ శాస్త్ర‌వేత్త‌. ఆయ‌న‌కు ప‌ద్మ భూష‌న్ అవార్డు కూడా ఇచ్చారు. ఐయ‌నోస్పియ‌ర్‌, రేడియోఫిజిక్స్‌లో ప్రొఫెస‌ర్ మిత్రా అద్భుత‌మైన అధ్య‌య‌నాలు చేశారు. 
 
అయితే ఈ క్రేట‌ర్స్ అన్నింటినీ చంద్ర‌యాన్‌2లోని కెమెరా సుమారు 4375 కిలోమీట‌ర్ల దూరం నుంచి తీసింది. జాక్స‌న్ లోయ చంద్రుడి ఉత్త‌ర ద్రువం వైపున ఉన్న‌ది. అది సుమారు 71 కిలోమీట‌ర్ల వెడ‌ల్పుతో ఉంది. మిత్రా క్రేట‌ర్ సుమారు 92 కిలోమీట‌ర్ల వెడ‌ల్పుతో ఉంది. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాశ్మీర్‌లో పరిస్థితులన్నీ ప్రశాంతం : డోనాల్డ్ ట్రంప్