Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆవులతో లిప్ లాక్‌కు ఎగబడుతున్న జనాలు... కారణం తెలుసా?

Advertiesment
Lip lock
, బుధవారం, 22 మే 2019 (18:54 IST)
సోషల్ మీడియా పుణ్యమాని ఎప్పుడూ ఏదో ఒకటి ట్రెండింగ్ అవుతూనే ఉంది. మొన్నటి ఐస్‌ బకెట్ నుంచి నిన్నటి కికీ ఛాలెంజ్ వరకు ఎన్నో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పుడు కొత్తగా ‘కౌ కిస్సింగ్ ఛాలెంజ్’ పేరుతో ఒక ఛాలెంజ్ వైరల్ అవుతోంది. ఈ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తూ యువత ఆవులకు లిప్‌కిస్ ఇస్తూ ఆ వీడియోలు, ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తమకు తెలిసినవారికి సవాలు విసురుతున్నారు. 
 
స్విట్జర్లాండ్‌కు చెందిన ‘క్యాస్టల్’ అనే యాప్ ఈ ఛాలెంజ్‌ను మొదలుపెట్టింది. #KuhKussChallenge హ్యాష్‌ట్యాగ్‌తో సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్న ఈ ఛాలెంజ్‌ స్విట్జర్లాండ్‌‌తో పాటుగా మిగిలిన దేశాలకు కూడా పాకింది. ఓ స్వచ్ఛంద సంస్థకు నిధులు చేకూర్చాలనే ఉద్దేశ్యంతో దీన్ని మొదలుపెట్టినట్లు యాప్ సంస్థ చెప్పుకొంది. 
 
అయితే, ఆవులకు ముద్దుపెట్టే ఈ ఛాలెంజ్ చాలా ప్రమాదకరమైనదని, పాలిచ్చే ఆవులు చాలా కోపంగా ఉంటాయి. వాటి దగ్గరకు వెళ్లి ఇలాంటి చర్యలకు పాల్పడితే అవి దాడి చేసే ప్రమాదం ఉంది. అందుకే ఆస్ట్రియా ప్రభుత్వం దీనిని సీరియస్‌గా తీసుకుంటోందట. 
 
ఈ ఛాలెంజ్‌కు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తోంది. ఇది చూడటానికి, వినడానికి సరదాగా అనిపిస్తున్నా, దీని వలన ప్రమాదం జరిగే లేదా ప్రాణాలు కోల్పోయే అవకాశం కూడా ఉంది మరి!!

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ముఖం చూపిస్తే చాలు... ఏటీఎం నుంచి డబ్బు డ్రా...