సుప్రీంకోర్టు జోక్యం... అయ్యప్ప ఆగ్రహం... అందుకే కేరళ మునిగిందా?
కేరళ రాష్ట్రంలో గత వందేళ్ల చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా కుంభవృష్టి కురవడానికిగల కారణాలను కొందరు ఛాందసవాదులు తమకుతోచిన విధంగా చెబుతున్నారు. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో వేదభూమిగా పేరుగాంచిన కేరళ రాష్ట్రం ఇ
కేరళ రాష్ట్రంలో గత వందేళ్ల చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా కుంభవృష్టి కురవడానికిగల కారణాలను కొందరు ఛాందసవాదులు తమకుతోచిన విధంగా చెబుతున్నారు. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో వేదభూమిగా పేరుగాంచిన కేరళ రాష్ట్రం ఇపుడు సంభవించిన వరదల్లో మునిగిపోవడానికి గల కారణాన్ని వారు వివరిస్తున్నారు.
ప్రసిద్ధ శబరిమలై పుణ్యక్షేత్రంలోకి మహిళలకు కూడా ప్రవేశం కల్పించాలంటూ ఇటీవల సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. ఇలా అయ్యప్ప ఆలయ వ్యవహారాల్లో దేశ అత్యున్నత జోక్యం చేసుకోవడం వల్లే కేరళ రాష్ట్రం వరదల్లో మునిగిపోతోందంటూ పలువురు ఛాందసవాదులు ట్వీట్లు చేశారు.
ఈ ట్వీట్లు వివాదాస్పదమయ్యాయి కూడా. వీటిపై పలువురు నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేరళ వరదలకు, శబరిమలలో మహిళల ప్రవేశానికి ముడిపెట్టి ట్వీట్ చేసిన వారిలో ఆర్‌బీఐ బోర్డు సభ్యుడితో పాటు ఆర్‌ఎస్ఎస్ ప్రముఖుడూ ఉండటంతో నెటిజన్లు మరింత రెచ్చిపోయారు.
వరుస ట్వీట్లతో దాడి చేశారు. 'వరదలను మతపరమైన విషయాలతో ముడిపెట్టొద్దు. మీరు ఏదైనా చేయగలిగితే వరదల్లో చిక్కుకున్న వారికి సహాయం చేయండి' అంటూ ఘాటైన రిప్లై ఇచ్చారు. దీంతో మతఛాందసవాదులు గుప్‌చుప్ అయిపోయారు.