Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కేదార్‌నాథ్ వద్ద ప్రపోజల్ వీడియో.. ఇలాంటి తీశారో అంతే సంగతులు...

Advertiesment
Kedarnath
, బుధవారం, 5 జులై 2023 (12:56 IST)
Kedarnath
కేదార్‌నాథ్ ఆలయం వెలుపల ఒక మహిళ తన ప్రియుడికి ప్రపోజ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ సీరియస్ అయ్యింది. 
 
భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా పవిత్ర కేదార్‌నాథ్ ఆలయ ఆవరణలో వీడియోలు చేసే వ్యక్తులపై కఠినమైన నిఘా ఉంచాలని అభ్యర్థించింది. దేశ విదేశాల నుంచి భక్తులు భారీ స్థాయిలో తరలివచ్చే ఈ ఆలయంలో ఇలాంటి పనులు చేయడం కూడదని పేర్కొంది. 
 
కొందరు యూట్యూబర్‌లు, ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌లు ప్రజల మతపరమైన మనోభావాలకు వ్యతిరేకంగా వీడియోలు, యూట్యూబ్ షాట్స్, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేస్తున్నారు, దీని కారణంగా ఆలయాన్ని సందర్శించే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి.
 
కాబట్టి, దయచేసి మతపరమైన భావాలకు వ్యతిరేకంగా వీడియోలు, యూట్యూబ్ షాట్స్, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేసే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోండి, తద్వారా భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండవచ్చని పోలీసులకు ఆలయ కమిటీ రాసిన లేఖలో పేర్కొంది. 
 
ఇకపోతే.. కేదార్‌నాథ్‌లో అమ్మాయి తన బాయ్‌ఫ్రెండ్‌కు ప్రపోజ్ చేస్తున్న వీడియో ఇటీవల వైరల్ కావడంతో, ఇప్పుడు భక్తులు ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించే ముందు తమ మొబైల్ ఫోన్‌లను స్విచ్ ఆఫ్ చేయమని కోరుతున్నారు. 
 
అయితే, త్వరలోనే మొబైల్స్‌ని ఆలయం వెలుపల ఉంచేందుకు ఏర్పాట్లు చేయనున్నట్టు సమాచారం. ఈ వీడియోలో ప్రపోజల్స్ చేసిన జంట పద్ధతిగా వున్నా.. ఇది ఆన్‌లైన్‌లో చర్చకు దారితీసింది.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హస్తిన బాట పట్టిన ఏపీ సీఎం జగన్.. ప్రధాని - హోం మంత్రి దర్శనం కోసం..