Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కాబోయే భార్యకు అమేజాన్ అధినేత కాస్టీ గిఫ్ట్.. ఏంటది?

Advertiesment
Jeff Bezos
, శనివారం, 12 ఆగస్టు 2023 (15:51 IST)
Jeff Bezos
అమేజాన్ అధినేత జెఫ్ బెజోస్ తనకు కాబోయే భార్యకు ఓ కాస్లీ గిఫ్ట్ ఇచ్చారు. జెఫ్ బెజోస్ 68 మిలియన్ డాలర్ల భవనాన్ని ఆమె కోసం కొనుగోలు చేసినట్లు సమాచారం. అమెరికాలోని ఫ్లోరిడా తీరంలో ఓ విలాసవంతమైన భవనాన్ని కొనుగోలు చేశారు. 
 
అయితే ఆ ఆస్తిని జెఫ్ బెజోస్ జూన్ 2023లోనే కొనుగోలు చేసారని.. ఇప్పుడే ఆ సమాచారం బయటికి వచ్చిందని టాక్. జెఫ్ బెజోస్ చాలా కాలంగా మియామిలోని ఈ ఇండియన్ క్రీమ్ ప్రాంతంలో ఆస్తిని కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. 
 
ఈ ప్రదేశం కోటీశ్వరులలో విపరీతమైన క్రేజ్‌ను కలిగి ఉంది. ఈ ప్రాంతం చాలా మంది బిలియనీర్లకు నిలయం. అందుకే దీనిని ‘బిలియనీర్స్ బంకర్’ అని కూడా పిలుస్తారు. ఇలాంటి ప్రాంతంలో అమేజాన్ అధినేత భవనం కొనుగోలు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లిఫ్టులో చిక్కుకున్న తల్లీబిడ్డను కాపాడిన కొరియర్ బాయ్