Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జయా బచ్చన్ ఆస్తుల విలువ రూ.1000 కోట్లు... వాచ్‌ల విలువ రూ.3.4 కోట్లు!

బాలీవుడ్ 'బిగ్ బి' అమితాబ్ సతీమణి జయా బచ్చన్. ఈమె రాజ్యసభ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. గతంలో ఒకసారి పెద్దల సభకు ప్రాతినిథ్యం వహించిన ఆమె.. ఇపుడు మరోమారు పోటీలో నిలిచారు.

Advertiesment
Jaya Bachchan
, మంగళవారం, 13 మార్చి 2018 (11:53 IST)
బాలీవుడ్ 'బిగ్ బి' అమితాబ్ సతీమణి జయా బచ్చన్. ఈమె రాజ్యసభ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. గతంలో ఒకసారి పెద్దల సభకు ప్రాతినిథ్యం వహించిన ఆమె.. ఇపుడు మరోమారు పోటీలో నిలిచారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర నుంచి బరిలోకి దిగుతున్న ఆమె... తాజాగా తన నామినేషన్‌ను దాఖలు చేశారు. ఇందులో ఆమె ఆస్తుల వివరాలను పొందుపరిచారు.
 
ఈ నామినేషన్ పత్రాల్లో పేర్కొన్నట్టుగా జయా బచ్చన్ ఆస్తుల విలువ రూ.1000 కోట్లు. ఆమె రాజ్యసభకు ఎంపికైతే అత్యంత ధనిక ఎంపీగా నిలవనున్నారు. కాగా, ఎస్పీ నుంచి రాజ్యసభ ఎంపీ రేసులో ఉన్న జయ 2012లో పోటీచేసినప్పుడు ఆమె ఆస్తుల విలువ రూ.493 కోట్లున్నట్లు గతంలో వెల్లడించారు. 2012లో కలిగి ఉన్న వారి ఆస్తుల విలువ ప్రస్తుతం రెండు రెట్లు పెరిగాయి.
 
అమితాబ్, జయ దగ్గరున్న చేతి గడియారాల విలువ వరుసగా రూ.3.4 కోట్లు, రూ.51లక్షలున్నట్లు పేర్కొన్నారు. రూ.9 లక్షల విలువగల పెన్నులు ఉన్నట్టు  వెల్లడించారు. అలాగే, ఫ్రాన్స్‌లోని బ్రిజ్‌నొగాన్ ప్లేజ్‌లో బచన్ కుటుంబానికి 3,175 చదరపుటడుగుల నివాసిత ఆస్తులు ఉన్నట్లు వివరించారు. అంతేగాక దేశంలోని ప్రముఖ నగరాలు నోయిడా, భోపాల్, పుణె, అహ్మదాబాద్, గాంధీనగర్‌లో ఆస్తులు ఉన్నట్టు ఆమె తన ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. 
 
ఈ ఎన్నికల్లో ఆమె గెలుపొంది రాజ్యసభలో అడుగుపెడితే అతిపెద్ద ధనవంతురాలైన సభ్యురాలిగా రికార్డు సృష్టించనున్నారు. ప్రస్తుతం 2014లో బీజేపీ తరపున రాజ్యసభకు ఎంపికైన రవీంద్ర కిశోర్ సిన్హా రూ.800 కోట్ల ఆస్తితో ప్రస్తుతం అత్యంత ధనవంతుడిగా కొనసాగుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నిత్యం శీలాన్ని శంకిస్తూ సూటిపోటి మాటలు.. తనువు చాలించిన విప్రో ఉద్యోగిని.. ఎక్కడ?