మహానేత దివంగత మహానేత డాక్టర్ వైఎస్సార్ జయంతి సందర్భంగా సీంఎం వై.ఎస్. జగన్, ఆయన సోదరి షర్మిలా కలుస్తారా? లేదా ? అనేది సస్పెన్స్ అని వై.ఎస్. అభిమానులు ఉత్కంఠ వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలో దివంగత నేత వైఎస్సార్ జయంతి కార్యక్రమం నిర్వహించారు. వైఎస్సార్ ఘాట్ వద్దకు ఉదయమే వై.ఎస్. విజయమ్మ, వైఎస్ షర్మిల కుటుంబ సభ్యులు చేరుకుని నివాళులు అర్పించారు. వైఎస్సార్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు.
అయితే, వారు ఇక్కడి వచ్చే సమయానికి, సీఎం జగన్మోహన్ రెడ్డి గన్నవరం ఎయిర్ పోర్ట్ లో ప్రత్యేక విమానంలో బయలుదేరారు. ఆయన అక్కడి నుంచి నేరుగా అనంతపురం జిల్లాకు చేరుకుంటారు. సీఎం జగన్ రాక సందర్భంగా రాయదుర్గంలో విస్తృతమైన బందోబస్తు చేపట్టారు. దాదాపు 2వేల మంది పోలీసులతో బందోబస్తు పెట్టారు.
అయితే, జగన్ మధ్యాహ్నం రెండు గంటలకు పులివెందుల చేరుకుంటారు. అప్పటికి షర్మిల తిరిగి హైదారబాద్ చేరుకుంటారు. తన కొత్త పార్టీ వై.ఎస్.ఆర్. టి.పి. ని ఆమె హైదారాబాదు ఫిలింనగర్లో ప్రారంభిస్తారు. అంటే, జగన్ ఇటు... షర్మిల అటు అన్నమాట. వీరిద్దరూ పులివెందులలో కలుసుకునే అవకాశం కనిపించడంలేదు. అసలు ఈ అన్నా చెల్లెల్లు కలుసుకుంటరా లేదా అని అభిమానులు ఉత్కంఠతో ఉన్నారు.