Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రధాని మోడీపై ప్రశంసలు - ఇళయరాజాకు రాజ్యసభ సీటు?

Advertiesment
ilayaraja
, సోమవారం, 18 ఏప్రియల్ 2022 (09:24 IST)
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెహ్ అంబేద్కర్‌పై ప్రశంసల వర్షం కురిపించిన సంగీత మేథావి ఇళయరాజాకు రాజ్యసభ సీటు వరించనుంది. రాష్ట్రపతి కోటాలో ఆయన్ను రాజ్యసభకు నామినేట్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. 
 
బీజేపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి పదవీకాలం త్వరలో ముగియనుంది. ఆయన స్థానంలో ఇళయరాజాను రాష్ట్రపతి కోటా కింద నామినేట్ చేయాలని బీజేపీ పెద్దలు దాదాపుగా ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. దీనికి ప్రధాన కారణం ప్రధాని నరేంద్ర మోడీని డాక్టర్ అంబేద్కర్‌తో పోల్చడమే. 
 
ఇటీవల "అంబేద్కర్ అండ్ మోడీ - ఫీర్మ్స్ ఐడియాస్, ఫెర్ఫార్మర్స్ ఇంప్లిమెంటేషన్" అనే పుస్తకానికి ఇళయరాజా ముందుమాట రాశారు. ఇందులో అంబేద్కర్ ఆశయాలను ప్రధాని మోడీ నెరవేర్చుతున్నారంటూ వ్యాఖ్యానించారు. పైగా, అంబేద్కర్ జీవించివుంటే ప్రధాని మోడీని చూసి గర్వపడేవారంటూ కితాబిచ్చారు. 
 
ఈ వ్యాఖ్యలు ఓ వర్గానికి తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. తమిళనాడులోని బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు ఇళయరాజాపై దుమ్మెత్తి పోశాయి. బీజేపీ శ్రేణులకు మాత్రం మరింత ఉత్తేజాన్ని కల్పించాయి. ఈ నేపథ్యంలోనే ఇళయరాజాను రాజ్యసభకు నామినేట్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైందన్న వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కంచికచర్ల వద్ద రోడ్డు ప్రమాదం - 15 మందికి గాయాలు