Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రపంచ నర్సుల దినోత్సవం.. ఎలా మొదలైందంటే..?

ప్రపంచ నర్సుల దినోత్సవం.. ఎలా మొదలైందంటే..?
, బుధవారం, 12 మే 2021 (10:46 IST)
Nurse Day
మానవ సేవయే మాధవ సేవ అనే నినాదంతో నిరంతరం అంకితభావంతో తమ సేవలందిస్తున్నారు నర్సులు. కులం-మతం, పేద-ధనిక తేడా చూడకుండా రోగులకు మేమున్నామంటూ ఓదారుస్తూ ఆత్మీయంగా పలకరిస్తూ, సపర్యలు చేస్తూ అక్కున చేరుకుంటున్న నర్సులు నేడు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. 
 
వైద్యశాలలో చేరిన నాటి నుండి ఆరోగ్యంగా కోలుకునే వారు నిరంతరం చేస్తున్న కృషి అమోఘం. గాయపడిన క్షతగాత్రులను ప్రేమతో ఆప్యాయంగా ఆదరించి, సేవలందించిన ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతి సందర్భంగా మే 12న ప్రపంచవ్యాప్తంగా నర్సుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.
 
ఎంతో సేవాతత్పరతతో కూడిన నర్సింగ్‌ వృత్తికి, ఆధునిక నర్సింగ్‌ విద్యకు లేడీ విత్‌ ద ల్యాంప్‌ పేరుతో ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతినొందిన ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌ ఆద్యురాలు, మార్గదర్శకురాలు, స్ఫూర్తి ప్రధాత. 1820 మే 12 ఇటలీలోని ఫ్లోరెన్స్‌ నగరంలో బ్రిటీష్‌ కుటుంబంలో జన్మించిన ఫ్లోరెన్స్‌ నైటింగిల్‌ నర్సు వృత్తికి స్పూర్తిదాయకంగా నిలిచినందుకు ప్రపంచ వ్యాప్తంగా మే 12న ఆమె జయంతిని నర్సుల దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా మారింది.
 
30 ఏళ్ల ప్రాయంలో జర్మనీలోని కెయిసర్‌ వర్త్‌లో నర్సింగ్‌ విద్యాభ్యాసం చేసిన నైటింగిల్‌... అనంతరం పారిస్‌లో విధి నిర్వహణ చేస్తున్న కాలంలో యూరప్‌లో క్రిమియాన్‌ యుద్ధం జరిగింది. అందులో గాయాలపాలై రక్తసిక్తమై అల్లాడుతున్న సైనికుల వ్యధాభరిత కథనాలను వార్తాపత్రికల్లో చదివి చలించిపోయింది. 
 
క్షతగాత్రులను ఎలాగైనా కాపాడాలని నిశ్చయించుకుని కొంతమంది నర్సుల బృందంతో టర్కిలో ఆ సైనికులున్న లుక్ట్రాయి ఆసుపత్రికి చేరుకుంది. అక్కడ ప్రతిరోజూ వైద్య సేవలు చేస్తూ నిశిరాత్రిలో కూడా చిన్న లాంతరు పట్టుకుని సైనికులను ఓదార్చుతూ వారికి సేవలందించింది. అప్పుడే నైటింగిల్‌ను లేడి విత్‌ ద ల్యాంప్‌ అని పిలవడంతో ఆమెకు ఆ పేరు చరిత్రలో నిలిచిపోయింది. 
 
అయితే క్షతగాత్రులకు సేవలందిస్తున్న సమయంలో అక్కడి వాతావరణానికి ఆమె తీవ్రమైన అనారోగ్యానికి గురైంది. ఆనాటి నుంచి 50ఏళ్లపాటు అనారోగ్యంతో బాధపడుతూనే నర్సింగ్‌ సేవలను కొనసాగించింది. ఆమె జీవితంలోని చివరి పదేళ్లు కళ్లు కానరాకపోయినా వృత్తిని మాత్రం వీడలేదు. 
 
అంకిత భావంతో సేవలు చేస్తూనే 1910 ఆగస్టు 10న రోగుల కళ్లలో వెలుగులు నింపిన లేడీ విత్‌ ద ల్యాంప్‌ కన్నుమూసింది. లండన్‌లోని ప్రఖ్యాత థామస్‌ ఆసుపత్రిలో నర్సింగ్‌ స్కూల్‌ను స్థాపించి అప్పట్లో ఆధునిక నర్సింగ్‌ విద్యకు బీజం వేసి ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌ ఆద్యురాలైంది.
 
ఈ రంగంలో పరిశోధనలు జరిపి గ్రంధాలు రచించి, యుద్ధభూమిలోని క్షతగాత్రుల వెతలను తీర్చి జీవితాంతం అంకిత భావంతో అణువణువునా సేవా తత్పరతను నిలుపుకున్న ఫ్లోరింగ్‌ నైటింగేల్‌ నేటికీ ఎన్నటికీ చిరస్మరణీయంగా నిలిచే ఆదర్శమూర్తి .
 
ఇకపోతే.. ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఫర్ నర్సెస్(ఐసీఎల్) 1965లో నర్సింగ్‌డేను గుర్తించింది. ఆ తర్వాత 1974లో యూఎస్ గవర్నమెంట్ తాత్కాలికంగా ఈ వేడుకలను ఆమోదించింది. 1999లో నర్సెస్ అండ్ పబ్లిక్ సెక్టార్ ఎంప్లాయూస్ యూనియన్ నర్సింగ్‌డేకు ప్రాముఖ్యతను ఇచ్చింది. 
 
1974లో యూఎస్, కెనడా ఈ వేడుకలను మే 9 నుంచి 15వ తేదీ వరకు ఏటా వారోత్సవాలు నిర్వహించాలని ప్రకటించింది. నైటింగేల్ మే 12న జన్మించినందున వరల్డ్ నర్సింగ్ డే్ణ వేడుకలు అదేరోజున నిర్వహించాలని నిర్ణరుుంచారు. అప్పటి నుంచి ఏటా మే 12న వరల్డ్ నర్సింగ్ డే నిర్వహిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తల్లితో కామవాంఛ తీర్చుకుని... ఆపై హత్య చేసిన కుమారుడు.. ఎక్కడ?