సాధారణంగా వివాహం అంటే రెండు మనసుల కలయిక. ఇరు కుటుంబాల కలయిక. అయితే, ప్రేమ పెళ్లైనా, పెద్దలు కుదిర్చిన వివాహమైనా తెలిసిన వారు, బంధువులు సంబంధాల కంటే పరిచయం లేని వ్యక్తులు, దూరపు సంబంధాల్నే చేసుకోవడానికే అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు. అలాగే, కొన్ని సందర్భాల్లో కొందరు రక్త సంబంధాలు, మేనరికం పేరుతో బావ లేదా మేనమామను పెళ్లి చేసుకుంటారు. కానీ కూతురే కన్న తండ్రిని వివాహం చేసుకోవడం ఎక్కడైనా చూశారా? తల్లీకూతుళ్లిద్దరికీ భర్త ఒక్కరే అన్న వింత గురించి మీరెప్పుడైనా విన్నారా? ఈ మాట వింటుంటే చెవుల్లో సీసం పోసినట్టుగా ఉంది కదా. ఈ కంఠోరంగా ఉన్న ఈ విడ్డూరాన్ని ఓ తెగ ప్రజలు ఆచారంగా పాటిస్తుంది. ఇంతకీ ఆ తెగ ఎక్కడుంది... వారి సంప్రదాయం, కట్టుబాట్లు, ఆచార వ్యవహారాలు ఏంటి అనేది పరిశీలిస్తే,
బంగ్లాదేశ్‌లోని ఓ మారుమూల ప్రాంతాల్లో నివశించే ప్రాచీన తెగల్లో మండి తెగ ఒకటి. ఎన్నో ఏళ్లుగా ఇక్కడి భాష, ఆచార వ్యవహారాలు ఇతర ప్రాంతాల కంటే భిన్నంగా ఉండటం గమనించవచ్చు. కన్న కుమార్తెను తండ్రే పెళ్లి చేసుకునే పద్దతి కూడా ఇందులో ఒకటి. ఈ క్రమంలో ఊహ తెలియని వయసులోనే అమ్మాయిలకు తమ తండ్రులతో వివాహం చేసినా, 15 యేళ్లనేళ్ళు నిండిన తర్వాత కాపురం చేయిస్తారట. ఇలా ఈ తెగలో తల్లీబిడ్డలిద్దరికీ భర్త ఒక్కరే ఉంటారన్నమాట.
ఒకవేళ భర్త చనిపోతే అదే తెగకు చెందిన ఓ వ్యక్తి ముందు తల్లిని పెళ్లి చేసుకోవడం, ఆమె సంతానాన్ని తమ సొంత పిల్లలుగా చూసుకోవడం ఈ తెగ వాసుల ఆచారం. ఇక ఈ పిల్లల్లో ఆడపిల్లలు ఉంటే సవతి తండ్రిని పెళ్లి చేసుకోవాలన్న నిబంధన కూడా ఉంది. ఈ మాట వినడానికి కాస్త విడ్డూరంగా ఉన్నప్పటికీ మండి తెగ ప్రజలు మాత్రం ప్రాచీన కాలం నుంచే పాటిస్తున్నట్టుగా అక్కడి వారు చెబుతున్నారు.