Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కర్ణాటకలో పదవుల పందేరం : కాంగ్రెస్‌కు హోం.. జేడీఎస్‌కు ఆర్థికం

కర్ణాటక రాష్ట్రంలో మంత్రిత్వశాఖల కేటాయింపు ముగిసింది. ఫలితంగా త్వరలో మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగనుంది. ఈనెల 24వ తేదీన కన్నడనాట జేడీఎస్, కాంగ్రెస్ సంకీర్ణ సర్కారు కొలువుదీరింది.

కర్ణాటకలో పదవుల పందేరం : కాంగ్రెస్‌కు హోం.. జేడీఎస్‌కు ఆర్థికం
, గురువారం, 31 మే 2018 (18:33 IST)
కర్ణాటక రాష్ట్రంలో మంత్రిత్వశాఖల కేటాయింపు ముగిసింది. ఫలితంగా త్వరలో మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగనుంది. ఈనెల 24వ తేదీన కన్నడనాట జేడీఎస్, కాంగ్రెస్ సంకీర్ణ సర్కారు కొలువుదీరింది. కూటమి తరపున ముఖ్యమంత్రిగా జేడీఎస్ నేత కుమార స్వామి ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రోజున ఆయన ఒక్కరే ప్రమాణం చేశారు.
 
అయితే మంత్రి పదవుల కేటాయింపుల్లో చిక్కుముడులు ఏర్పడటంతో ఒక్క మంత్రి కూడా ప్రమాణ స్వీకారం చేయలేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, జేడీఎస్ అగ్రనేతల మధ్య మంత్రిత్వ శాఖల కేటాయింపుపై కీలక చర్చలు జరిగాయి. ఈ చర్చలు సఫలీకృతమయ్యాయి. 
 
దీంతో ఆర్థిక శాఖను జేడీఎస్‌, హోం శాఖను కాంగ్రెస్ పంచుకున్నట్లు సమాచారం. ఈ రెండూ కీలక శాఖలు కావడంతో వీటిపై ఇన్నాళ్లూ కొనసాగిన తర్జనభర్జనకు ఫుల్‌స్టాప్ పడినట్టయింది. మిగిలిన శాఖల విషయంలో ఇరు పార్టీలు ఇప్పటికే ఓ అవగాహనకు వచ్చినట్లు తెలిసింది. కాగా, ముందుగా అనుకున్నట్టుగానే... కాంగ్రెస్‌కు 22, జేడీఎస్‌కు 12 మంత్రి పదవులు దక్కనున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పేరుకే బిల్లు కలెక్టర్.. అవినీతిలో అనకొండ.. రూ.80 కోట్ల ఆస్తులు