Publish Date: Tue, 19 Sep 2023 (10:41 IST)
Updated Date: Tue, 19 Sep 2023 (10:43 IST)
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ప్లాన్-బీ సిద్ధం చేసుకుంది. చంద్రబాబుతోపాటు లోకేశ్‌నూ అరెస్టు చేస్తే... నారా వారి కోడలు, నందమూరి ఆడపడుచు బ్రాహ్మణి రంగంలోకి దిగి పార్టీ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
స్కిల్ స్కామ్ పేరుతో చంద్రబాబును ఇప్పటికే అరెస్టు చేశారు. రిమాండ్‌ను అక్రమంగా ప్రకటించి, దానిని కొట్టివేయాలంటూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ ప్రక్రియను వీలైనంత కాలం పొడిగించాలని ప్రభుత్వం భావిస్తోంది.
కోర్టు నిర్ణయం ఎలా ఉన్నప్పటికీ, రకరకాల కేసులను తెరపైకి తెచ్చి వీలైనన్ని రోజులు ఆయనను జైలులో ఉంచాలన్నదే వైసీపీ లక్ష్యం. అందుకు అనుగుణంగా సీఐడీ రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.