Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నామినేటెడ్ పోస్టులు ప్ర‌క‌టించిన హోం మంత్రి సుచ‌రిత‌

నామినేటెడ్ పోస్టులు ప్ర‌క‌టించిన హోం మంత్రి సుచ‌రిత‌
, శనివారం, 17 జులై 2021 (12:52 IST)
వైసీపీలో నామినేటెడ్ పోస్టుల ఉత్కంఠ‌కు తెర‌దించుతూ, ఆ పోస్టుల‌ను ఎట్ట‌కేల‌కు ప్ర‌క‌టించారు. విజయవాడ ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో జరిగిన నామినేటెడ్ పోస్టుల ప్రకటన కార్యక్రమంలో ఏపీ గౌర‌వ స‌ల‌హ‌దారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీలు నందిగం సురేష్, మోపిదేవి వెంకటరమణ, శ్రీనివాస వేణుగోపాల్, మేరుగు నాగార్జునలు పాల్గొన్నారు.

నామినేటెడ్ పోస్ట్ ల వివరాలను వెల్లడించిన హోంమంత్రి మేకతోటి సుచరిత, ఎక్కువ పోస్టుల‌ను అణ‌గారిన వ‌ర్గాల‌కే ఇచ్చామ‌న్నారు. రాష్ట్రంలోని మొత్తం 135 కార్పొరేషన్ చైర్మన్ల పేర్లను ప్రకటించారు. వీటిలో దాదాపు 76 పదవులను ఎస్పీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు కేటాయించారు. 59 మంది OC వర్గానికి చెందిన వారికి కార్పొరేషన్ చైర్మన్ పదవులు దక్కాయి. మొత్తం పదవుల్లో 68 పదవులు ప్రత్యేకంగా మహిళలకు కేటాయించారు. 56 శాతం వెనుకబడిన వర్గాలకు, 50.3 శాతం మహిళకు కేటాయించారు. 
 
50.4  శాతం పదవులు మహిళలకు కేటాయించామ‌ని స‌జ్జ‌ల రామ‌కృష్నా రెడ్డి చెప్పారు. గుంటూరు జిల్లాలో 9 పోస్టుల్లో.. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 6, తూ.గో జిల్లాలో 17 పోస్టుల్లో.. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 9, ప్రకాశం జిల్లాలో 10 పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5 కేటాయించామ‌న్నారు. అలాగే, కృష్ణా జిల్లాలో 10 పోస్టుల్లో.. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 6, అనంతపురం జిల్లాలో 10 పోస్టులకు..ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5,

విశాఖ జిల్లాలో 10 పదవుల్లో..
5 ఎస్సీ, ఎస్టీ, బీసీలకు, చిత్తూరు జిల్లాలో 12 పోస్టుల్లో..ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 7 కేటాయించారు. ప.గో జిల్లాలో 12 పదవుల్లో..ఎస్సీ, ఎస్టీ ,బీసీలకు 6, శ్రీకాకుళం జిల్లా 7 పోస్టుల్లో.. ఎస్సీ ఎస్టీ , బీసీలకు 6, వైఎస్ఆర్‌ జిల్లా 11 పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 6, కర్నూలు జిల్లాలో 10 పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5 కేటాయించారు. నామినేటెడ్ పదవులు వచ్చిన వారు బాధ్యతాయుతంగా పని  చేయాల‌ని సజ్జల రామ‌కృష్ణారెడ్డి సూచించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో నామినేటెడ్ పోస్టులు, క‌మ్మ కార్పొరేష‌న్ ఛైర్మ‌న్‌గా బుడ్డి!