Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పేరుకే వెయిటర్.. మైకేల్ జాక్సన్‌లా స్టెప్పులు.. వీడియో వైరల్

Advertiesment
పేరుకే వెయిటర్.. మైకేల్ జాక్సన్‌లా స్టెప్పులు.. వీడియో వైరల్
, శనివారం, 13 ఫిబ్రవరి 2021 (19:10 IST)
waiter
వెయిటర్​గా పనిచేస్తున్న ఓ యువకుడు డ్యాన్స్‌తో అదరగొట్టాడు. హోటల్​లో అతడు చేసిన డ్యాన్స్​ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ప్రొఫెషనల్​లా ఓ లెవల్​లో అతడి డ్యాన్స్ ఉంది. ఎక్సెప్రెషన్స్​, స్టెప్పులు, స్లో మోషన్, రోబిటిక్ మూమెంట్లు​ ఇలా ఎన్నో ఫీట్లు చేశాడు. అతడి శరీరంలో ఏమైనా స్ర్పింగులు ఉన్నాయా అనేలా అద్భుతంగా డ్యాన్స్ చేశాడు. 
 
వివరాల్లోకి వెళితే.. గువహటిలోని ఓ రెస్టారెంట్​లో వెయిటర్​గా పని చేస్తున్న సురాజిత్ త్రిపుర ఈ అద్భుతమైన డ్యాన్స్ చేశాడు. రెస్టారెంట్​లో బాఘీ సినిమాలోని గర్ల్ ఐ నీడ్ యూ పాటకు సూపర్ స్టెప్పులతో అదరగొట్టేశాడు. ఇతడి డ్యాన్స్​కు ఫిదా అయిన సోనాలీ కృష్ణ అనే యూజర్ ఫేస్​బుక్​లో వీడియో పోస్ట్ చేశారు. 
webdunia
waiter
 
'ఈ రోజు గువహటిలో అద్భుతమైన వంటకం. అద్భుతమైన పర్ఫార్మెన్స్​తో మమ్మల్ని సర్​ప్రైజ్ చేసినందుకు సురాజిత్​ త్రిపురకు థాంక్స్​. ఎదుగుతూ.. మెరుస్తూనే ఉండు సోదరా' అని ఆమె క్యాప్షన్ పెట్టారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. పేరుకే వెయిటర్ అని.. మైకేల్ జాక్సన్‌లా ఇరగదీస్తున్నాడని కామెంట్లు చేస్తున్నారు.

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మనస్పర్థలెందుకు? మాట్లాడుకుందాం రా... రెండో భార్యను హత్య చేసిన మొదటి భార్య