Publish Date: Mon, 15 Jun 2026 (16:10 IST)
Updated Date: Mon, 15 Jun 2026 (16:15 IST)
రాపిడో డ్రైవర్లుగా మహిళలు ప్రస్తుతం రాణిస్తున్నారు. పురుషులకు ధీటుగా రాపిడో డ్రైవర్లు వాహనాలు నడుపుతున్నారు. తాజాగా ఓ మహిళా రాపిడో డ్రైవర్ నెటిజన్ల ప్రశంసలు అందుకుంది. గూగుల్ మ్యాప్స్ తప్పిదం వల్ల దారి తప్పిన విదేశీ మహిళకు అండగా నిలిచిన మహిళా రాపిడో రైడర్‌ను నెటిజన్లు ప్రశంసలతో కొనియాడుతున్నారు.
చుట్టుపక్కల ఎవరూ లేక భయాందోళనకు గురవడంతో విదేశీ మహిళకు భరోసానిచ్చి ఆ విదేశీ మహిళను సురక్షితంగా హోటల్‌కు చేర్చిన సింధు అనే మహిళా రాపిడో రైడర్‌ను నెటిజన్లు కితాబిస్తూ పోస్టులు పెడుతున్నారు.
దిక్కుతోచని స్థితిలో తనను రక్షించిన రాపిడో రైడర్‌పై విదేశీ మహిళ కూడా కృతజ్ఞతలు తెలిపింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.