Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వంగ బాబా జ్యోతిష్యం- 2023లో సౌర తుఫాను.. ప్రపంచానికి విపత్తు తప్పదా?

Advertiesment
Blind Baba Vanga
, బుధవారం, 21 డిశెంబరు 2022 (13:34 IST)
వంగ బాబా జ్యోతిష్యం ప్రస్తుతం జనాలను భయాందోళనలకు గురిచేస్తుంది. బల్గేరియాకు చెందిన వంగబాబా భవిష్యత్తులో ఏం జరుగుతుందో ముందే ఊహించారనే సంగతి తెలిసిందే. 2023వ సంవత్సరం బాబా వంగా జ్యోతిష్యం ప్రకారం ఏం జరుగుతుందో ఊహించారు. 2023లో సౌర తుఫాను వస్తుందని.. తద్వారా తీవ్రమైన పరిణామాలు వుంటాయని అంచనా వేసింది. 
 
నాసా ప్రకారం సౌర తుఫాన్లు తరచూ వస్తూనే వుంటాయి. సూర్యుడి ఉపరితలంపై రాకాసి మంటలు ఎగసిపడినప్పుడు సౌర తుఫాను వస్తుంది. ఆ మంటలు భూమి అయస్కాంత క్షేత్రాన్ని దెబ్బతీస్తాయని తెలుస్తోంది. దీంతో రేడియో సమాచార వ్యవస్థ దెబ్బతినే అవకాశం వుంది. ఎలక్ట్రానిక్స్ పరికరాలు పనిచేయని పరిస్థితి ఏర్పడే ఛాన్సుంది. 
 
అంతేగాకుండా 2023 భూమి కక్ష్య మారుతుందని వంగబాబా ముందే అంచనా వేశారు. ఇలా జరిగితే విపత్తు తప్పదు. రేడియేషన్ పెరగడం.. అతివేడి, అతి చల్లని పరిస్థితులు తలెత్తుతాయి. ఇప్పటికే కరోనా వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇక దేశాలు.. జీవ రసాయన ఆయుధాల్ని తయారుచేస్తే.. అది ప్రపంచం మొత్తానికీ ప్రమాదకరమే. 
 
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఇలానే కొనసాగితే.. ఆ యుద్ధంలో జీవ రసాయన ఆయుధాలను ఉపయోగిస్తే.. తద్వారా వ్యాధులు వచ్చే  అవకాశం వుంది. ఇది ప్రపంచ ప్రజలను పట్టి పీడించే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. 1996లో 84 ఏళ్ల వయసులో వంగబాబా కన్నుమూశారు. అప్పటివరకూ ఆమె.. చాలా భవిష్యత్ అంచనాలు వేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో వాద్ నగర్