సుప్రిసిద్ధ కుమార స్వామి ఆలయాల్లో పేరెన్నిక గన్న తిరుచ్చెందూరు ఆలయం వరద నీటితో నిండిపోయింది. గతంలో సునామీ వచ్చినా ఇక్కడి సముద్రపు నీరు వెనక్కి వెళ్లింది. అలాంటిది మహిమాన్వితమైన కుమార స్వామి ఆలయంలో వరద నీరు ప్రవేశించడంపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అలాగే సముద్ర నీటి మట్టానికి సమానంగా వరద నీరు.. తిరుచ్చెందూరు ఆలయంలోనికి వచ్చింది. వరద కారణంగా సముద్రపు జాడే తెలియలేదు. ఇంకా వరదల కారణంగా ఆలయం బోసిపోయింది. తిరుచ్చెందూరులో వరదనీరు ప్రవేశించేందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అలాగే తూత్తుకుడి-తిరుచ్చెందూరు హైవే నీట మునిగింది. తిరునెల్వేలి-తిరుచ్చెందూరు రైల్వే మార్గం వరద నీటిలో మునిగింది. రైలు పట్టాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. తిరుచ్చెందూర్ టు చెన్నై రైలులోనే 500మంది చిక్కుకుపోయారు. రైలు పట్టాలను వరద నీరు ముంచేయడంతో శ్రీ వైకుంఠం అనే రైల్వే స్టేషన్‌లోనే ఈ రైలు ఆగిపోయింది.