Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

స్వామి నన్ను కాపాడంటూ పన్నీరుసెల్వం, శశికళ పేరు చెబితేనే వణికిపోతున్న పళణి

స్వామి నన్ను కాపాడంటూ పన్నీరుసెల్వం, శశికళ పేరు చెబితేనే వణికిపోతున్న పళణి
, శుక్రవారం, 12 ఫిబ్రవరి 2021 (18:48 IST)
అన్నాడిఎంకే పార్టీలో జయలలిత మరణం తరువాత ఇక చిన్నమ్మ శశికళ ముఖ్యమంత్రి పీఠం ఎక్కడం ఖాయమనుకున్నారు అందరూ. అయితే ముఖ్యమంత్రి అవ్వడానికి సరిగ్గా ఒకరోజు ముందుగానే ఆమె అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్ళింది. కానీ జైలుకు వెళ్ళేదాని కన్నా ముందు ఆమె తనకు అత్యంత సన్నిహితంగా ఉండే పళణిస్వామికే ముఖ్యమంత్రి పదవిని అప్పగించింది.
 
పన్నీరుసెల్వం మాత్రం ఉపముఖ్యమంత్రి అప్పట్లో ఉన్నారు గానీ శశికళను ముందు నుంచి వ్యతిరేకిస్తూ వచ్చారు. దీంతో అతన్ని దూరంగా పెట్టాల్సి వచ్చింది. కానీ పళణిస్వామి కూడా మొదట్లో శశికళకు వీరవిధేయుడిగా ఉండాలని భావించారు. కానీ ప్రభుత్వం పడిపోతోందేమోనన్న భయంతో పన్నీరుసెల్వంతో జత కట్టారు.
 
శశికళను బాగా ముంచారు. ఇదంతా తెలిసిందే. కానీ బెంగుళూరు నుంచి తిరిగి వచ్చేసిన శశికళ చివరకు పళణిస్వామి, పన్నీరుసెల్వంలనే టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. కానీ అంతకన్నా ముందే సిఎం, డిప్యూటీ సిఎంలే టార్గెట్ చేశారు. 
 
శశికళ బెంగుళూరు నుంచి రాగానే నేరుగా చెన్నైకు వెళ్ళిన మరుసటి రోజు ఆమె బంధువులకు సంబంధించిన ఆస్తులను జప్తులు చేయించారు. ఇళవరసి, సుధాకరన్‌కు చెందిన కోట్లాదిరూపాయల ఆస్తులను ప్రభుత్వం జప్తు చేసింది. అంతకుముందే జయలలిత సమాధి వద్దకు శశికళ వెళ్ళాలనుకుంటే అక్కడ ఆపేశారు. 
 
ఒకవైపు శశికళకు చెక్ పెడుతూనే మరోవైపు ఇద్దరూ భయంతో వణికిపోతున్నారంటున్నారు విశ్లేషకులు. నిన్న తిరుమల శ్రీవారిని తమిళనాడు ఉపముఖ్యమంత్రి పన్నీరుసెల్వం దర్సించుకున్నారు. ఒకరే స్వామివారి సేవలో పాల్గొన్నారు. శశికళ విడుదల తరువాత పన్నీరుసెల్వం తిరుమల శ్రీవారిని దర్సించుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
 
మరోవైపు తన కేబినెట్ లోని మంత్రులు ఎవరైనా శశికళ పేరు చెబితేనే చాలట పళణిస్వామి వణికిపోతున్నారట. ఆమె పేరు ఎక్కడా మాట్లాడదవద్దని హెచ్చరిస్తున్నారట. దీంతో తమిళనాడు రాజకీయాలు హీట్ పుట్టిస్తున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తూచ్... నేను అలా అనలేదు.. వ్యవస్థలపై ఎంతో గౌరవం ఉంది.. కొడాలి నాని