చిత్తూరు జిల్లాలో వరసగా రెండోరోజు కూడా భూమి కంపించడంతో ప్రజలు బెంబేలెత్తిపోయారు. రామకుప్పంలో రాత్రిలో భూమి కంపించడంతో పలు ఇళ్లకు బీటలు వారాయి. కొన్నిచోట్ల ఇంట్లో వస్తువులు చిందరవందరగా శబ్దం చేస్తూ కిందపడిపోయాయి. దీంతో భూకంపం అని గమనించిన స్థానికులు ఇళ్ల బయటకు పరుగులు తీసారు. రాత్రంతా ఇంటి బయటే జాగారం చేసారు.
మరోవైపు మిజోరంలో ఇండో-మయన్మార్ సరిహద్దు ప్రాంతంలో 'ఆగ్నేయ దిశగా 73 కిలోమీటర్ల దూరంలో' శుక్రవారం 6.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (ఎన్ సిఎస్) ప్రకారం శుక్రవారం భూకంపం సంభవించింది.
త్రిపుర, మణిపూర్ మరియు అస్సాం అంతటా భూకంపం ప్రకంపనలు సంభవించాయి. అయితే, ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఇటీవల అస్సాంలోని గౌహతిలో నవంబర్ 20న '38 కిలోమీటర్ల పశ్చిమ నైరుతి' ప్రాంతంలో 4.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈశాన్య భారతదేశం, తరచుగా భూకంపానికి ఎక్కువగా గురయ్యే ప్రాంతంగా మారుతుంది.