సోషల్ మీడియాలో పలు ఆసక్తికర వీడియోలను షేర్ చేస్తుంటారు నెటిజన్లు. ప్రస్తుతం కుక్కలకు సంబంధించి విపరీతంగా చర్చ జరుగుతోంది. ఈ నేపధ్యంలో వాలీబాల్ క్రీడలో ఓ కుక్క కూడా పాల్గొంది. పాల్గొనడమే కాదు తమ జట్టు విజయానికి ఆనందంతో ఎగిరి కౌగలించుకుంది.
షేర్ చేసిన వీడియోలో ఓ కుక్కతో పాటు మరో క్రీడాకారుడు వాలీబాల్ క్రీడలో పాల్గొన్నారు. అవతల జట్టులో ఇద్దరు వున్నారు. ఇరు జట్ల మధ్య జరిగిన పోటీలో కుక్కతో కూడిన జట్టు విజయం సాధించింది. ఈ వీడియో కాస్త వైరల్ అవుతోంది.