Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బీటెక్ చదివి పానీపూరీ వ్యాపారిగా మారింది... ఫోనులో మాట్లాడుతూ కన్నీళ్లు

Vada Pav girl

సెల్వి

, శనివారం, 16 మార్చి 2024 (12:14 IST)
Vada Pav girl
సోషల్ మీడియాలో పలు స్ట్రీట్ ఫుడ్స్ బాగా ఫేమస్ అవుతుంటాయి. తాజాగా ఓ బీటెక్ చదివిన యువత పానీపూరి వ్యాపారిగా మారిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. చంద్రికా గేరా దీక్షిత్ అనే వీధి వ్యాపారి, హల్దీరామ్‌లో తన ఉద్యోగాన్ని విడిచిపెట్టి, ఢిల్లీలోని సైనిక్ విహార్‌లో వడ పావ్ స్టాల్‌ను ప్రారంభించింది.
 
అయితే ఈ ఏడుపుకు సంబంధించిన తాజా వీడియో సోషల్ మీడియాలో ట్రెడింగ్ అయ్యింది. ఇన్‌స్టాగ్రామ్‌లో హ్యాండిల్ ఫుడ్‌ లవర్స్ షేర్ చేసిన వీడియో, తన ఫుడ్ స్టాల్‌ను తొలగించమని మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (MCD) అధికారుల నుండి ఆమె ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ఇందుకే ఆమె కన్నీళ్లు పెట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. 
 
రూ.30,000-35,000 మధ్య చెల్లించిన తర్వాత కూడా అధికారులు డబ్బు డిమాండ్ చేస్తున్నారని ఆమె పేర్కొంది. అప్పుడు ఆమె సహాయం కోసం తన సోదరుడిని పిలుస్తుంది.
 
వడా పావ్ స్టాల్ వద్ద కస్టమర్ సర్వ్ చేస్తున్నప్పుడు ఆమె ఫోన్‌లో మాట్లాడుతుంది. మున్సిపాలిటీ అధికారులు తనను ఒత్తిడికి గురిచేస్తున్నారనే విషయాన్ని తన సోదరుడికి ఫోన్ చేసి చెప్పింది. చంద్రిక ఈ విధంగా తన కష్టాలను చెప్పుకుంటూ ఏడిస్తూ కనిపించే దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు.
 
“లైసెన్సు తీసుకుని అధికారికంగా చేయండి ఎవరూ వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు. కానీ కేవలం ఏడుపు ద్వారా సానుభూతిని పొందవద్దు. నియమాలు అందరికీ ఉంటాయి కాబట్టి మీరు అనుసరించడం మంచిది.. అంటూ నెటిజన్లు అంటున్నారు. ప్రాథమికంగా ఈ ఫుడ్ స్టాల్స్ ప్రభుత్వ భూమిని ఆక్రమణకు గురిచేస్తున్నాయని నెటిజన్లు వాదిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కవిత అరెస్టుతో భారాసపై అవినీతి మరక: లోక్ సభ ఎన్నికల వేళ భారీ నష్టం తప్పదా?