Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విమానాలు ఇకపై నిట్టనిలువుగా హెలికాప్టర్‌లాగా ఎగురుతాయి.. ఎక్కడ?

ముంబై విమానాశ్రయం పేరుకు మరో పదం వచ్చి చేరింది. అదే ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం పేరుకు మహరాజ్ అనే పదాన్ని జోడిస్తున్నట్లు ప్రభు గురువారం తెలిపారు. దీంతో చాలాకాలంగా మహారాష్ట్ర ప్రజలు చేస్తున్

Advertiesment
Chhatrapati Shivaji Maharaj International Airport
, శుక్రవారం, 31 ఆగస్టు 2018 (12:19 IST)
ముంబై విమానాశ్రయం పేరుకు మరో పదం వచ్చి చేరింది. అదే ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం పేరుకు మహరాజ్ అనే పదాన్ని జోడిస్తున్నట్లు ప్రభు గురువారం తెలిపారు. దీంతో చాలాకాలంగా మహారాష్ట్ర ప్రజలు చేస్తున్న డిమాండ్ నెరవేరిందని వెల్లడించారు. పనిలోపనిగా ఈ డిమాండ్‌ను పరిష్కరించేందుకు చొరవచూపిన ప్రధాని నరేంద్ర మోడీకి ప్రభు ధన్యవాదాలు కూడా తెలిపారు.
 
ఈ ట్వీట్‌ను చూసిన నెటిజన్లకు చిర్రెత్తుకొచ్చింది. అంతేనా చిత్ర విచిత్రంగా వ్యంగ్యాస్త్రాలు కూడా సంధిస్తున్నారు. 'అవునవును.. ఇక ముంబై ఎయిర్ పోర్టులో ఒక్క విమానం కూడా లేట్ కాదు. అన్ని విమానాలు ఇకపై నిట్టనిలువుగా హెలికాప్టర్‌లాగా ఎగురుతాయి' అని ఓ నెటిజన్ వెటకారమాడాడు. 
 
మరొకరు విమానాశ్రయానికి 'హిందూ హృదయ్ సామ్రాట్ శ్రీ ఛత్రపతి శివాజీ మహరాజ్ సాహిబ్ కీ జై.. జై.. జై.. మహారాష్ట్ర ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం అని పేరు పెట్టండి' అంటూ వ్యంగ్యంగా స్పందించాడు. తమకు ఇలాంటి పేర్ల మార్పులు వద్దనీ, ఎన్నికల్లో ఇచ్చిన అభివృద్ధి హామీల అమలు, నల్లధనం వెనక్కి తీసుకురావడం, ఉద్యోగ కల్పనపై దృష్టి పెట్టాలని మరో వ్యక్తి చురకలు అంటించాడు. 
 
మీడియాకు మాత్రమే కాదు సోషల్ మీడియా కూడా రెండువైపులా పదునున్న కత్తి లాంటిది. దాంతో ఎంత లాభమో... జాగ్రత్తగా లేకుంటే అంతే నష్టం జరుగుతుందని తాజా ట్వీట్‌తో మంత్రి సురేష్ ప్రభుకు స్పష్టంచేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎస్సైగా వుండి.. అక్రమ సంబంధం.. అడిగితే భార్యను, అత్తను చితకబాదాడు..