భారతీయులకు బ్రెజిల్ బెస్ట్ ఆఫర్... ఏంటది?

శుక్రవారం, 25 అక్టోబరు 2019 (19:29 IST)
భారతీయులకు బ్రెజిల్ ఓ బెస్ట్ ఆఫర్‌ను ప్రకటించింది. ఎలాంటి వీసా సౌకర్యం లేకుండానే తమ దేశాన్ని భారతీయులు సందర్శించవచ్చని ఆ దేశ అధ్యక్షుడు జేర్ బోల్సోనారో తెలిపారు. ప్రస్తుతం ఆయన చైనా పర్యటనలో ఉంటూ ఈ ప్రకటన చేశారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ఇప్పటికే అమెరికా, కెనడా, జపాన్‌, ఆస్ట్రేలియా దేశాల పౌరులకు కూడా బ్రెజిల్ ఈ సదుపాయాన్ని కల్పించిందని గుర్తుచేశారు. తాజాగా, భారత్‌తో పాటు చైనాను కూడా ఆయన ఈ జాబితాలో చేర్చినట్టు చెప్పారు. 
 
అయితే, పైన పేర్కొన్న ఏ ఒక్క దేశం కూడా బ్రెజిల్‌ పౌరులకు వీసా లేకుండా తమతమ దేశాలకు వచ్చే అవకాశాన్ని కల్పించలేదు. ఆయా దేశాల పర్యాటకులు, వ్యాపారులు వీసా లేకుండానే బ్రిజిల్ వెళ్లవచ్చు. 
 
జేర్‌ బోల్సొనారో గతేడాది బ్రెజిల్‌ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయన గతంలో పలుసార్లు జాతి విద్వేష వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. అలాగే, అమెజాన్ కార్చిచ్చు పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతున్న ఎన్‌జీవోల వల్లేనంటూ ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం మాకది కావాలంటూ రోడ్డుకి అడ్డంగా గ్రామస్తులు, గర్జించిన సింహా