Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 18 April 2025
webdunia

బైకును కారులా మార్చేశాడు.. ఆరుగురితో హ్యాపీగా జర్నీ చేశాడు.. (వీడియో)

Advertiesment
Bike Car

సెల్వి

, మంగళవారం, 8 ఏప్రియల్ 2025 (14:32 IST)
Bike Car
బైకు లేని ఇళ్లు ప్రస్తుతం లేదనే చెప్పాలి. అయితే మిడిల్ క్లాస్ పీపుల్ కారు కొనడం అంటే బడ్జెట్ చూసుకుంటారు. అయితే లక్షలు పెట్టి కారు కొనడం ఎందుకు బైకులోనే ఫ్యామిలీతో ఎంచక్కా తిరిగేయవచ్చునని ఓ వ్యక్తి అంటున్నాడు. అందుకు అనుకూలంగా సీట్లు ఏర్పరుచుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 
 
ఈ వీడియోలో ఓ వ్యక్తి బైకుకు ఇరు వైపులా రెండేసి సీట్లు వచ్చేలా ఏర్పాటు చేసుకున్నాడు. ఇంకా పై కప్పు కూడా రెడీ చేసుకున్నాడు. అంతే ఫ్యామిలీతో కారులో ఎనిమిది మంది ప్రయాణం చేసేలా బైకును కారులా మార్చేశాడు. 
 
ఈ బైక్ కమ్ కారులో ఆ వ్యక్తి ఫ్యామిలీతో చేసిన జర్నీకి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కారులో కంటే ఇందులో చాలామంది ప్రయాణం చేయొచ్చునని కామెంట్లు పెడుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అనంతపురం కియా కంపెనీలో దొంగలుపడ్డారు.. 900 కారు ఇంజిన్లు చోరీ!!