Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జయలలితకు వంగివంగి దండాలు పెట్టారు.. నన్ను చూస్తే అలుసా: చంద్రబాబు

ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు బీజేపీ నేతలను లక్ష్యంగా చేసుకుని ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాటల తూటాలు పేల్చుతున్నారు.

జయలలితకు వంగివంగి దండాలు పెట్టారు.. నన్ను చూస్తే అలుసా: చంద్రబాబు
, శనివారం, 17 మార్చి 2018 (15:16 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు బీజేపీ నేతలను లక్ష్యంగా చేసుకుని ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాటల తూటాలు పేల్చుతున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత ఉన్నప్పుడు భాజపా నాయకులు ఆమె వద్దకు వంగి వంగి నమస్కారాలు చేస్తూ వెళ్లేవారు. నన్ను చూస్తే అంత అలుసేంటి? అంటూ నిలదీశారు. 
 
ఎన్డీయే కూటమి నుంచి వైదొలగిన తర్వాత ఆయన కమలనాథులను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్న విషయం తెల్సిందే. ఇదే అంశంపై చంద్రబాబు మాట్లాడుతూ, భాజపాకి మిత్రపక్షంగా ఉంటూ అవిశ్వాస తీర్మానం పెట్టడం నైతికత కాదు. అందుకే అవిశ్వాసం నోటీసు ఇవ్వకముందే తెగదెంపులు చేసుకున్నాం. కాంగ్రెస్‌ సహా అవిశ్వాస తీర్మానానికి ఎవరు మద్దతిచ్చినా తీసుకుంటాం. మా ప్రకటన చూశాక మద్దతిచ్చేందుకు చాలా పార్టీలు స్వచ్ఛందంగానే ముందుకొచ్చాయన్నారు. 
 
ఇకపోతే, తన కుమారుడు లోకేష్‌పై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చేసిన అవినీతి ఆరోపణలను ఖండిస్తున్నా. లోకేష్‌కి హెరిటేజ్‌లో ఏటా రూ.100 కోట్ల లాభాలొస్తున్నాయి. రూ.35 కోట్లు పన్నులు చెల్లించినా, మిగతా రూ.65 కోట్లతో హాయిగా వ్యాపారం చేసుకోవచ్చు కదా? ఎందుకింత కష్టపడాలి? లోకేష్‌ చిన్నప్పుడు రాత్రి ఆలస్యంగా ఇంటికి వెళ్లాకయినా వాడిని చూసేవాడిని. ఇప్పుడు లోకేష్‌కి శని, ఆదివారాల్లో తప్ప తన కొడుకును చూసుకునే పరిస్థితి లేదని వాపోయారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బీజేపీని ఓడించేందుకు మళ్లీ చేతులు కలుపనున్న ఎస్పీ - బీఎస్పీ