Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

లాలూచీ రాజకీయాలకు చెక్ : మోడీ 4యేళ్ల పాలనపై అమిత్ షా

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం శనివారంతో నాలుగేళ్ళు పూర్తి చేసుకుంది. దీంతో దేశవ్యాప్తంగా నాలుగేళ్ల సంబరాలను నిర్వహిస్తోంది. ఈ నాలుగేళ్ళ మోడీ ప్రభుత్వంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా స్పందిస్

లాలూచీ రాజకీయాలకు చెక్ : మోడీ 4యేళ్ల పాలనపై అమిత్ షా
, శనివారం, 26 మే 2018 (15:38 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం శనివారంతో నాలుగేళ్ళు పూర్తి చేసుకుంది. దీంతో దేశవ్యాప్తంగా నాలుగేళ్ల సంబరాలను నిర్వహిస్తోంది. ఈ నాలుగేళ్ళ మోడీ ప్రభుత్వంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా స్పందిస్తూ, దేశాభివృద్ధి కోసం ప్రధాని మోడీ రోజులో 18 గంటలు కష్టపడుతున్నారన్నారు. మోడీలాంటి వ్యక్తి తమకు నాయకుడిగా ఉండటం గర్వంగా ఉందన్నారు.
 
అద్భుతమైన పథకాలతో దేశంలో అభివృద్ధిలో దూసుకెళ్తోందన్నారు. ఎన్డీయే కూటమి నుంచి టీడీపీ పెళ్లిపోయినప్పటికీ.. జేడీయు చేరికతో అది లెవల్ అయిపోయిందన్నారు. 2014 ఎన్నికల తర్వాత 11 పార్టీలు ఎన్డీయే కూటమిలో చేరాయని గుర్తుచేసిన అమిత్ షా... వచ్చే ఎన్నికల్లో మహారాష్ట్రలో శివసేనతో కలిసి పోటీ చేయనున్నట్టు తెలిపారు. 
 
కాంగ్రెస్ ప్రభుత్వ పాలన సమయంలోనూ ఇంధన ధరలు ఇలాగే ఉన్నాయని, కానీ మా ప్రభుత్వం సమయంలో కనీసం మూడు రోజులు కూడా కాంగ్రెస్ తట్టుకోలేకపోతున్నదన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని, సుదీర్ఘకాల పరిష్కారం కోసం వెతుకుతున్నట్లు ఆయన తెలిపారు. 
 
పాకిస్థాన్‌తో యుద్ధం చేయాలన్నది ఆఖరి అంశంగా మాత్రమే తీసుకుంటామని, సరిహద్దు సంరక్షణ విషయంలో వెనక్కి తగ్గేదిలేదన్నారు. బీజేపీ ప్రభుత్వ సమయంలోనే ఉగ్రవాదులు ఎక్కువ మంది చనిపోయారన్నారు. మోడీ మోస్ట్ హార్డ్‌వర్కింగ్ ప్రధాని అని షా కితాబు ఇచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జియో బంపర్ ఆఫర్... ఉచితంగా 8 జీబీ డేటా