ఆన్‌లైన్‌లో ఓ వ్యక్తి పిడకలు కొన్నాడు. అందరూ షాకయ్యే రేటే చెల్లించాడు. తర్వాత రివ్యూ ఇచ్చాడు. ఇంత వరకూ ఓకే. కానీ.. అవి టేస్ట్ బాలేవంట. మట్టి మట్టిగా ఉన్నాయట. రుచీ పచీ లేకుండా చేశారు. ఈ మాత్రం రుచి లేని పిడకలకి ఇంత రేటా. ఏంటండీ ఇదీ అని రివ్యూ పెట్టేశాడు.
ఇంకేముంది.. సోషల్ మీడియాలో వైరల్ అయి కూర్చుంది. పిడకలు కొన్నది తినడం కోసమా నాయనా.. పిడకల్ని అప్పలు అనుకుని తిన్నవా.. కేక్ ముక్కలు అనుకుని తిన్నవా.. గుండ్రంగా ఉన్నయ్ కదా బిస్కెట్లు అనుకుని తిన్నవా అన్నది హాట్ టాపిక్ అయింది. అంతా ట్రెండింగ్ చేస్తున్నారు. టేస్ట్ గురించి ఇంకాస్త ఎక్స్ ప్లెయిన్ చేస్తే బావుండేది అంటూ.. ఫన్నీగా కామెంట్లు చేసుకుంటున్నారు.
ఇక్కడే ఇంకో ఇంట్రస్టింగ్ పాయింట్ కూడా ఉంది. ఈ రివ్యూని కూడా లైక్ చేసిన వాళ్లున్నారు. హెల్ప్ ఫుల్ అని బటన్స్ నొక్కారు. అదేంటి.. పిడకలు రుచిగా లేవు అంటే.. అదెట్టా హెల్ప్ ఫుల్ అవుతుంది. కేక్ రుచిగా లేదు.. సద్దివాసన వస్తుంది.. స్వీట్ తక్కువ ఉంది అని రివ్యూ ఇస్తే.. బాలేదేమోలే.. మాకూ హెల్ప్ అయింది.. లేదంటే మేమూ కొని తినేవాళ్లం అని.. హెల్ప్ ఫుల్ బటన్ నొక్కుతారు.
మరి ఇట్టెట్టా హెల్ప్ ఫుల్ అయిందబ్బా అంటూ నవ్వకుంటున్నారు ఇది చూసిన వాళ్లు. ఈ రివ్యూకి హెల్ప్ ఫుల్ అని బటన్ నొక్కిన వాళ్లు కూడా తినాలి అనుకుంటున్నారా.. లేదంటే వాళ్లు కూడా ఇలాగే తింటారా అంటూ.. సెటైర్లు వేస్తున్నారు.
అమెజాన్‌లో ఈ ప్రోడక్ట్ కింద పండుగలు, పూజలు, ఇతర సాంప్రదాయ కార్యక్రమాల కోసం వాడే పిడకలు, సహజమైన, నాణ్యమైన ఆవు పేడతో చేసిన కౌ డంగ్ కేక్స్ అని రాసి ఉంది. అయినప్పటికీ అర్థంచేసుకో లేకపోయిన ఆ విదేశీయుడు వాటిని తినే కేక్స్ అనుకోవడం అందరిని నవ్వుకునేలా చేస్తోంది. ఇక అమెజాన్‌కు ఆ విదేశీ కస్టమర్ ఇచ్చిన రివ్యూ చూసినవారంతా కరకరలాడేలా, క్రంచీగా లేకుంటే ఎలా మరి అంటూ సెటైర్లు వేస్తున్నారు.
కొంతమంది ఇండియన్ కౌ డంగ్ కేక్స్ అంతే మరి అంటూ తెగ నవ్వుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడు కౌ డంగ్ కేక్స్ పై సరదా చర్చ జరుగుతుంది . ఇప్పటికైనా సదరు విదేశీయుడుకి ఇవి ఆవుపేడతో తయారు చేసిన పిడకలని , ఇవి తినేవి కాదని అర్థం అవుతాయో లేదో అని జోకులు వేస్తున్నారు.